కొద్దిరోజుల క్రితం అమెరికా క్షిపణ దాడిలో మృతి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి మరణంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. తమ క్షిపణ దాడిలో మరణించింది జవహరినేనని అమెరికా చెబుతోంది.
అయితే తాము డీఎన్ఏ టెస్టు ద్వారా దీన్ని రుజువు చేయలేదని అమెరికా చెబుతోంది. అందుబాటులో ఉన్న వివిధ సోర్సుల ఆధారంగా తమ క్షిపణి దాడిలో మరణించింది ఖచ్చితంగా అల్ జవహరి అనే పేర్కొంటోంది.
ఆఫ్గనిస్తాన్ లో సెంట్రల్ కాబూల్‌లో అల్ ఖైదా నాయకుడు అల్ జవహిరి మృతికి సంబంధించిన డీఎన్ఏ నిర్ధారణ అమెరికా వద్ద లేదని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రకటించింది. జవహిరి గుర్తింపు, మరణం "ఇతర మూలాల" ద్వారా ధృవీకరించుకున్నామని వివరించింది.
జూలై 31 ఆదివారం ఉదయం 6:18 గంటలకు కాబూల్‌లోని తన సురక్షిత గృహంలోని బాల్కనీలోకి అయ్మాన్ అల్-జవహిరి వచ్చినప్పుడు అతడిని క్షిపణి దాడితో చంపామని అమెరికా అధికారి ఒకరు తెలిపారు . ఒక డ్రోన్ నుండి హెల్ఫైర్ క్షిపణులతో అతడిని మట్టుబెట్టామని ఆ అధికారి చెబుతున్నారు.
కాగా అల్-జవహిరి తలపై $25 మిలియన్ల (రూ.196 కోట్లు) బహుమానం ఉంది. అతడు సెప్టెంబర్ 11, 2011యునైటెడ్ స్టేట్స్‌లోని జంట టవర్లపై డులను సమన్వయం చేయడంలో సహాయం చేశాడు. విమానాలను హైజాక్ చేసి వాటితో అమెరికాలో ట్విన్ టవర్సును, ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని నేలకూల్చడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ దాడుల్లో 3000 మంది మరణించారు. మరెంతో మంది గాయపడ్డారు.
కాగా జవహరికి ఆశ్రయం కల్పించడం ద్వారా తాలిబన్ ప్రభుత్వం తమ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అమెరికా ఆరోపించింది. మరోవైపు తాలిబాన్ ప్రభుత్వ నిరసనను " అంతర్జాతీయ సూత్రాల ఉల్లంఘన "గా అభివర్ణించింది.