ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న పాదయాత్ర అర్థంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అమరావతి నుంచి అరసవల్లి వరకు పేరుతో చేపట్టిన ఈ యాత్రను కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో పోలీసులు ఆపేశారు.
హైకోర్టు నిర్దేశించిన 600కి మించి రైతులు యాత్ర చేస్తున్నారని.. అలాగే వారి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవే కారణాలతో రైతుల యాత్రను ఆపేశారు. రైతులు ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. తాము సూచించిన షరతుల మేరకే పాదయాత్ర చేయాలని హైకోర్టు రైతులకు సూచించింది. దీంతో రైతులు తమ యాత్రను తాత్కాలికంగా విరమించారు.
అయితే ఇప్పుడు తిరిగి అమరావతి రైతుల పాదయాత్ర మొదలైందని అంటున్నారు. అయితే ఎలాంటి ప్రచార ఆర్భాటాలు, మీడియా హడావుడి లేకుండా గప్ చుప్ గా సాగుతోందని తెలుస్తోంది. గతంలో అమరావతి రైతుల పాదయాత్రకు ఒక వర్గం మీడియాలో భారీ ఎత్తున ప్రాధాన్యత లభించేది. మరోవైపు ఉత్తరాంధ్రపై దాడికి చంద్రబాబు నేతృత్వంలోని పెయిడ్ ఆర్టిస్టులు వస్తున్నారని ఉత్తరాంధ్ర ప్రాంతపు మంత్రులు వ్యాఖ్యానించారు. అమరావతి రైతులను అడ్డుకుంటామని, జరగరాని ఘటనలు జరిగితే చంద్రబాబుదే బాధ్యత అని గుడివాడ అమరనాథ్, ధర్మాన ప్రసాదరావు వంటి మంత్రులు వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో రాజధాని రైతుల యాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించినప్పటి నుంచి తీవ్ర ఉద్రికత్తల మధ్యే నడిచింది. రాజమహేంద్రవరంలో వైసీపీ ఎంపీ భరత్ రామ్ ఆధ్వర్యంలో రైతులపైన దాడి జరిగిందని రైతులు అప్పట్లో ఆరోపించారు. పోలీసులు సైతం రైతుల యాత్రకు భద్రత కల్పించలేదని విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆగిపోయిన తమ పాదయాత్రను రైతులు మళ్లీ ప్రారంభించారని చెబుతున్నారు. ప్రస్తుతం రైతుల పాదయాత్ర అనకాపల్లికి చేరుకుందని అంటున్నారు. అయితే మీడియా హడావుడి లేకుండా, ఎలాంటి ప్రచార ఆర్బాటాలు లేకుండా రైతుల పాదయాత్ర సాగుతోందని సమాచారం.
ఉత్తరాంధ్రలో తమ పాదయాత్రను అడ్డుకునే అవకాశం ఉండటంతో పాదయాత్రను రహస్యంగానే కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో రైతుల పాదయాత్ర గమ్యస్థానమైన అరసవల్లికి చేరుకుంటుందని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.