అధిక ద్రవ్యోల్బణానికి తోడు వినిమయం పడిపోవడంతో అగ్ర రాజ్యం అమెరికా ఇప్పటికే ఆర్థిక మాంద్యంలోకి జారుకున్న సూచనలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఆహార, ఇంధన వినియోగదారుల ధరల సూచీ తమ అంచనాల కంటే ఎక్కువగా ఉందని అంటున్నారు. అమెరికాలో గత మేలో వినియోగదారుల ద్రవ్యోల్బణ సూచీ 8.6 శాతానికి ఎగిసింది. 1981 తర్వాత అంటే గడిచిన 40 ఏళ్ల తర్వాత ఇదే అత్యధిక ధరల సూచీ కావడం ఆ దేశ ఆర్థిక పరిస్థితిని సూచిస్తోంది.
అమెరికాలో 2022 మూడో త్రైమాసికంలో ఆర్థిక సంక్షోభం ప్రారంభం కానుందని.. ఇందులో అశ్యర్యపోవాల్సిందేమీ లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సంక్షోభ ప్రారంభానికి మధ్యలో అమెరికా ఉందని అంటున్నారు. ప్రస్తుత ఏడాది అమెరికా జీడీపీ వృద్ధి అంచనాను 2.8 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గిస్తూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చేసిన ప్రకటన ఆర్థిక సంక్షోభం వస్తుందనడానికి నిదర్శనమని పేర్కొంటున్నారు. ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు మందగించాయనడానికి ఇదొక సంకేతమని వివరిస్తున్నారు. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ 2022 సంవత్సరానికి రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం అంచనాను 4.3 శాతం నుంచి 5.2 శాతానికి పెంచింది. ఈ పరిణామాలు ఆ దేశ ఆర్థిక సంక్షోభానికి స్పష్టమైన సంకేతాలేనని నిపుణులు ఢంకా బజాయించి చెబుతున్నారు.
మరోవైపు బాండ్ మార్కెట్ సూచీ కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తోందని నిపుణులు అంటున్నారు. మళ్లీ 2007 స్థాయికి సూచీ చేరటంతో మాంద్యం ముంచుకొచ్చినట్టేనని పేర్కొంటున్నారు. యూఎస్ ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువగా 40 ఏళ్ల గరిష్టాలకు చేరుకుంది. ఫెడ్ కీలక వడ్డీ రేట్లను జూలై నెల చివరలో 100 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని సమాచారం. ఇదే జరిగినట్లయితే యూఎస్ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుందని హెచ్చరిస్తున్నారు. అగ్ర రాజ్యమే సంక్షోభం బారిన పడుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే ఫెడరల్ బ్యాంక్ తన వడ్డీ రేట్ల పెంపును మరింత పెంచినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని నిపుణులు అంటున్నారు. చికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ కూడా వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని హెచ్చరించడం ఇందుకు నిదర్శమని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో రెండు దశాబ్దాల తరువాత ఒక డాలర్ విలువ ఒక యూరోకు సమానమైంది. మాంద్యం భయంతో ముడి చమురు ఇప్పటికే 12 వారాల స్థాయికి పతనమైంది. ఇతర వస్తువుల ధరలు కూడా క్షీణించాయి, నికెల్ ధరలు గరిష్ట స్థాయి నుంచి 50.2 శాతం క్షీణించాయి. అల్యూమినియం ధర ఈ సంవత్సరం ఇప్పటివరకు 36.4 శాతం క్షీణించడం గమనార్హం.