మాంద్యం కోరల్లో అమెరికా ఉందా? అదెంత వరకు నిజం?

Update: 2022-08-12 08:10 GMT
ఆర్నెల్ల క్రితం వరకు చాలా తక్కువ మంది నోట వినిపించే మాట.. గడిచిన మూడు నెలలుగా పలువురి నోటి నుంచి తరచూ వినిపిస్తోంది. అదే అగ్రరాజ్యమైన అమెరికాలో మాంద్యం పరిస్థితులు నెలకొన్నాయని. ఉత్తినే మాట అనే ముందు ఆచితూచి అన్నట్లుగా అన్ని లెక్కలు వేసుకొని మాట్లాడే వారు మాత్రం.. ఆర్థిక మాంద్యం దిశగా అమెరికా పయనిస్తుందన్న జాగ్రత్తతో కూడిన స్టేట్ మెంట్ ఇస్తున్న పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాంద్యం నుంచి తప్పించుకునే వీల్లేదన్న మాట వినిపిస్తున్నా.. అందరూ భయపడిపోతున్నట్లుగా అమెరికాలో మాంద్యం పరిస్థితులు లేవంటున్నారు.

మాంద్యం అన్నంతనే చెప్పే మాట ధరలు పెరిగిపోవటం.. వృద్ధి రేటు పడిపోవటాన్ని ఆర్థిక మాంద్యంగా చెప్పటం తెలిసిందే. సాధారణంగా ఆర్థిక మాంద్యాన్ని ఎప్పుడు ప్రకటిస్తారంటూ.. వరుగా రెండు త్రైమాసికాలు స్థూల దేశీయోత్పత్తి (అదేనండి ఇంగ్లిషులో జీడీపీ) తగ్గుతూ వస్తే.. దాన్ని మాంద్యం పరిస్థితులు నెలకొన్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు ద్రవ్యోల్బణంతో పాటు నిరుద్యోగ రేటు వేగంగా పెరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ప్రజల ఆదాయం తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సున్నితమైన స్టాక్ మార్కెట్ సైతం చాలా వేగంగా స్పందిస్తూ ఉంటుంది.

ఇంతకీ ఆర్థిక మాంద్యానికి కారణం ఏమిటంటే.. కరోనా మహమ్మారి కారణంగా వస్తువుల సరఫరా వ్యవస్థ దెబ్బ తినటమే. పులి మీద పుట్ర మాదిరి కరోనాతో కిందా మీదా పడుతున్న ప్రపంచానికి..అనుకోని అనర్ధం మాదిరి రష్యా -ఉక్రెయిన్ మధ్య నడుస్తున్న యుద్ధం మరింతగా ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మాంద్యం తప్పదనే వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్లే అమెరికాలో వస్తువుల ధరలు గతంలో ఎప్పుడూ లేనంతగా పెరిగిపోవటంతో మాంద్యం కోరల్లోకి అగ్రరాజ్యం వెళుతుందన్న మాట వినిపిస్తోంది.

అయితే.. ఈ భయాందోళన పరిస్థితుల్లో కాస్తంత ఉపశమనం కలిగించే అంశం ఏమంటే.. గడిచిన వారం.. రెండు వారాలుగా అమెరికాలో మండిన వస్తువుల ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుతూ రావటం కాస్తంత ఊరటను ఇస్తోంది. అమెరికా చరిత్రలో అత్యంత దారుణమైన మాంద్యంగా చెప్పే 1854, 1980, 2008 నాటి పరిస్థితులు అయితే వచ్చే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది. మీడియాలో వస్తున్న కథనాలతో పోల్చినప్పుడు మాంద్యం పరిస్థితులు అంత తీవ్రంగా ఉండకపోవచ్చన్న మాట వినిపిస్తోంది.

అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు కరోనా కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే అయినా.. భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం మాత్రం లేదంటున్నారు. అయితే.. మాంద్యం పరిస్థితులు చోటు చేసుకుంటే మాత్రం మొదట ప్రభావితమయ్యే రంగాలు మాత్రం ఐటీ అని మాత్రం చెప్పక తప్పదు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. అమెరికా ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంటుందని తాను భావించటం లేదన్నారు.

ఉద్యోగిత గణాంకాలు ఆశాజనంగా ఉన్నందున.. ప్రస్తుతం వేగంగా పుంజుకుంటున్న డెవలప్ మెంట్.. స్థిరత్వాన్ని సాధించే అవకాశం ఉందంటున్నారు. మొదటి త్రైమాసికంలో జీడీపీలో 1.6 శాతం క్షీణత నమైదు అయితే.. రెండో త్రైమాసికంలోనూ ఇలంటి పరిస్థితి ఉన్నప్పటికీ.. స్వల్ప వృద్ధి ఉంటుందన్న అంచనాలు కాస్తంత ఊరట కలిగిస్తున్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News