అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి. నెల్లూరు జిల్లాకు చెందిన ఈ యువ నేత జగన్ కి అత్యంత సన్నిహితుడుగా పేరుపొందారు. ఆయన జగన్ మంత్రివర్గంలో ధీటైన నేతగా నిలిచారు. జగన్ వద్ద సైతం మంచి మార్కులు సాధించారు. అయితే కొన్ని సామాజిక సమీకరణల వల్ల అనిల్ కి మంత్రి పదవి రెండవ సారి దక్కలేదు. ఇక నెల్లూరు అంటే రెడ్డి రెడ్డి అంటే నెల్లూరు అన్నది ప్రపంచంలో ఎక్కడ ఎవరైనా మాట్లాడుతారు.
నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన మేకపాటి గౌతం రెడ్డి చనిపోయిన తరువాత కేవలం అనిల్ కుమార్ యాదవ్ ని కంటిన్యూ చేస్తే అసలుకే మోసం వస్తుంది అని అతన్ని తప్పించారు అన్నది ఒక విశ్లేషణ. ఇక నెల్లూరు పట్టణంలో చూస్తే మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కుటుంబానికి పెద్ద ఎత్తున అనుచరులు ఉన్నారు. మరో వైపు చూస్తే జిల్లా మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు కాబట్టి అతనికి కూడా అనుచరులు ఉన్నారు.
ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ కి తన సొంత నియోజకవర్గంలో ఉక్కబోత ఎలా చూసిన తప్పదు. ఎందుకంటే బలమైన నేతలు ఉన్న వైసీపీలో అనిల్ కి అంతా తానే అనుకునే సీన్ అయితే ఉండదు. ఇది అనిల్ ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు విషయంలో జరుగుతున్న వ్యవహారం. ఇక అనిల్ కూడా తాను మాజీ మంత్రిగా ఉన్నా దూకుడు అయితే ఎక్కడా తగ్గించడంలేదు. ఆయన బాహాటంగానే జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద కత్తులు దూస్తున్నారు.
అలాగే మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో ఒకనాడు సన్నిహితంగా ఉన్న అనిల్ ఇపుడు ఆయననే ప్రత్యర్ధిగా చూస్తున్నారు. ఈ పరిణామాల నేపధ్యం చూసినపుడు సహజంగానే అనిల్ కి తన నియోజకవర్గంలో ఒడుదుడుకులు తప్పవు. పైగా మంత్రిగా అనిల్ ఎంతవరకూ బాగా పనిచేశారు అన్నది కూడా అంతా లెక్కలోకి తీసుకుంటారు. ఆనాడు ఆయన అంతా తానే అనుకుని హవా చాటాలని చూశారు. ఇపుడు మాజీ కాగానే పొలిటికల్ రిటార్ట్ కూడా గట్టిగానే ఉంటుంది.
మరి దానికి పై ఎత్తు వేయాలి. రాజకీయంగా తన సత్తా చాటాలి. అంతే తప్ప బేలగా తనను టార్గెట్ చేస్తున్నారు అని అనిల్ భావించి బయట పెట్టుకుంటే రాజకీయంగా నష్టపోయేది ఆయనే అని అంతా అంటున్నారు. తాజాగా అనిల్ అంటున్న మాటలు ఇస్తున్న బోల్డ్ స్టేట్మెంట్స్ చూస్తే ఆయన సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డారా అని అనిపించకమానవు.
తనకు సొంత పార్టీలోనే శత్రువులు ఉన్నారని, తనను వెన్నుపోటు పొడుస్తున్నారు అని అనిల్ చెప్పడం మీద వైసీపీ లోపలా బయటా చర్చ సాగుతోంది. అయినా ఇది రాజకీయం. అంటే యుద్ధ భూమిలో ఉన్నట్లే. కత్తి ఎదురుగా రావచ్చు, పక్కన వెనకనా కూడా కత్తి గుచ్చుకోవచ్చు. ఇక తన వారూ పరవారూ అన్నది కూడా లేని రాజకీయాల్లో తనను తాను కాచుకునేందుకు చూడాలి తప్ప మీడియా ముందు వగచి వాపోయినా అనిల్ కి ఒరిగేది ఏమీ ఉండదు అని అంటున్నారు.
ఇక వైసీపీలో ఉన్న ఒక నాయకుడు నీతి మరచి సిగ్గుమాలిన పనులు చేస్తున్నారు అని అనిల్ ఆరోపైంచడం పట్ల రాజకీయంగా ప్రకంపనలు రేగుతున్నాయి. ఇక్కడ అనిల్ మరో ఆరోపణ కూడా చేశారు. తమ పార్టీలోని వారే కొందరు టీడీపీ వారితో కలసి తన మీద దాడి చేస్తున్నారని. ఇది అధినాయకత్వం పట్టించుకోవాల్సిన విషయంగానే చూడాలి. మరి అలాంటి వారు ఎవరో అనిల్ హై కమాండ్ కి చెప్పాలి, అంతే తప్ప బయటేసుకున్న సుఖం లేదని అంటున్నారు.
ఇక్కడ ఆయన మరో మాట అంటున్నారు. తనను వెన్నుపోటు పెడిచే వారి కాల్ డేతాతో పాటు మొత్తం జాబితా అంతా భద్రంగా ఆధారాలతో సహా ఉందని అంటున్నారు. అలాంటపుడు దాన్ని హై కమాండ్ ముందే పంచాయతీ పెట్టి తేల్చుకోవచ్చు కదా అన్న మాట కూడా వినిపిస్తోంది. మొత్తానికి అనిల్ కుమార్ తనకు వైసీపీలో వ్యతిరేకులు ఉన్నారని చెబుతున్నారు. వారి వివరాలు ఉన్నాయని అంటున్నారు. ఇన్ని ఉన్న తరువాత మీనమేషాలు లెక్కబెట్టడం ఎందుకు అధిష్టానం దృష్టిలోనే పెట్టాలని అంటున్న వారూ ఉన్నారు.
ఏది ఏమైనా అనిల్ చిన్న వయసులో రాజకీయంగా రాణించారు. కీలకమైన మంత్రిగా మూడేళ్ళ పాటు ఉన్నారు. ఆయనకు ఇంకా చాలా రాజకీయ భవిష్యత్తు ఉంది. అయితే సొంత పార్టీలో వ్యతిరేకులు అంటూ ఆయన చెబుతున్నారు అంటే ఆయన వ్యవహారశైలి కూడా సమీక్షించుకోవాలి కదా అన్న సూచనలు కూడా వస్తున్నాయి. మరి జగన్ వద్దకు ఈ పంచాయతీ వెళ్తే ఆయన ఎలాంటి తీర్పు ఇస్తారో తెలియదు కానీ పదే పదే ఇలా మీడియాకు ఎక్కి పార్టీ పరువు కనుక అనిల్ తీస్తే మాత్రం ఆయనకే రాజకీయంగా నష్టమని మాట వినిపిస్తోంది. చూడాలి మరి అనిల్ మాటల మనిషా చేతల మనిషా అన్నది ఏదో ఒక రోజు తేలిపోతుందేమో.