స్టార్టప్స్ లో ఏపీ అథమంలో ఉందా ?

Update: 2022-07-05 14:35 GMT
స్టార్టప్స్ ఏర్పాటు, ప్రోత్సాహంలో దేశంలోని చాలా రాష్ట్రాలతో పోల్చిస్తే ఏపీ చాలా అథమంలో ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటి) తాజాగా స్టార్టప్స్ ఏర్పాటు, ప్రోత్సాహం  విషయంలో ర్యాంకింగ్స్ విడుదలచేసింది.

ఈ ర్యాంకింగ్స్ ను డీపీఐఐటి ఐదు క్యాటగిరీలుగా వర్గీకరించింది. మెగాస్టార్స్, సూపర్ స్టార్స్, స్టార్స్, రైజింగ్ స్టార్స్, సన్ రైజర్స్ వర్గీకరణ ప్రకారమే రాష్ట్రాలకు ర్యాంకింగులు ఇచ్చింది.

2019 అక్టోబర్-2021, జూలై మధ్యలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగిన స్టార్టప్ రంగంలోని డెవలప్మెంట్ల ఆధారంగా వర్గీకరణ జరిగింది. 28 అంశాల ఆధారంగా రూపొందించిన ఈ వర్గీకరణలో మ్యాగ్జిమమ్ 100 పాయింట్లుగా డిసైడ్ చేసింది. ఈ వర్గీకరణ ఆధారంగా తెలంగాణా సూపర్ స్టార్ రేటింగ్ దక్కించుకున్నది. అలాగే గుజరాత్, కర్నాటకకు మెగాస్టార్ హోదా దక్కించుకున్నాయి.

ఇదే ర్యాంకింగుల్లో ఏపీ సన్ రైజర్స్ క్యాటగిరిలో ఎక్కడో పాతాళంలో పడిపోయింది. ఈ క్యాటగిలో ఏపీతో పాటు బీహార్, మిజోరం, లడ్డఖ్ లాంటి రాష్ట్రాలు కూడా ఉండటం గమనార్హం.

స్టార్టప్స్ అభివృద్ధి విషయంలో బీహార్లో అమలవుతున్న కొన్ని అంశాలను డీపీఐఐటి ప్రశంసించింది. అయితే ఏపీలో మాత్రం అలాంటి ప్రోత్సాహకాలు ఎక్కడా కనబడటంలేదట.

ఏపీలో ఇంటనీరింగ్ కళాశాలు చాలా ఎక్కువగానే ఉన్నప్పటికీ మంచి స్టార్టప్స్ ఎందుకు రావటంలేదో అర్ధం కావటంలేదని డీపీఐఐటి ఆశ్చర్యపోయింది.  స్టార్టప్స్ డెవలప్మెంట్ విషయంలో ఏపీలో సరైన ప్రోత్సాహం లేని కారణంగానే ప్రతిభ కలిగిన విద్యార్ధులంతా హైదరాబాద్, బెంగుళూరు లాంటి రాష్ట్రాలకు వెళిపోతున్నట్లు కూడా గుర్తించింది.
Tags:    

Similar News