ఏపీ గవర్నర్ ఢిల్లీ పర్యటన ఉత్తదేనా?

Update: 2021-06-19 12:30 GMT
ఏపీ సీఎంతో గవర్నర్ కు సత్సబంధాలున్నాయన్న విషయం చాలా సార్లు బయటపడిందని రాజకీయవర్గాల్లో ఓ టాక్ ఉంది.  ఇటీవల గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకం విషయంలో సీఎం జగన్ పంపిన నలుగురి పేర్లను ఆమోదించడంలో ఏపీ గవర్నర్ జాప్యం చేసినట్టు వార్తలువచ్చాయి. దీంతో జగన్ స్వయంగా రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ ను కలవగానే సాయంత్రానికి ఆ నలుగురికి ఆమోదముద్రపడింది. జాప్యం చేసినందుకో మరేదో కారణమో కానీ.. ఆ తర్వాత ఏపీ గవర్నర్ ను ఢిల్లీకి పిలిచారని ప్రచారం సాగింది.

అయితే ఆ ఇష్యూ తర్వాత గవర్నర్ ఢిల్లీ పర్యటన పెట్టుకోలేదని వార్తలువచ్చాయి. గవర్నర్ ఢిల్లీ వెళ్లలేదని అదంతా ఒట్టి ప్రచారం అన్నవారు కూడా ఉన్నారు.

కేంద్రంతో సయోధ్యతో ఉంటున్న జగన్ కు గవర్నర్ ఇప్పటిదాకా పెద్దగా ఇబ్బందులు పెట్టలేదు. మండలి వద్దన్నా కూడా.. జగన్ ప్రతిపాదించిన బిల్లులు అన్నింటిని ఆయన ఆమోదముద్ర వేశారు. ఇక ఎంతో మందిని ఢిల్లీకి పిలిపించి దిశానిర్ధేశం చేసే బీజేపీ అధిష్టానం ఏపీ గవర్నర్ ను మాత్రం పిలవలేదు. జగన్ తో బీజేపీ సాన్నిహిత్యమే అతడికి గవర్నర్ సహకరించేలా చేస్తోందని ప్రచారం సాగుతోంది.

నిజానికి బెంగాల్ సహా ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మొత్తం గవర్నర్లు అక్కడి బీజేపీ ప్రత్యర్థి ప్రభుత్వాలను అల్లాడిస్తున్నారు. పాలనకు అడ్డంకులు సృష్టిస్తున్నారన్న విమర్శలున్నాయి. కానీ ఏపీ, తెలంగాణ సహా కొన్ని మిత్రులు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నారన్న చర్చసాగుతోంది.
Tags:    

Similar News