ఏపీలో షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలు 2024 మేలో జరుగుతాయి. ఈ ఎన్నికల కోసం చంద్రబాబు బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. ఆయన జిల్లా టూర్లు స్టార్ట్ చేశారు. రాయలసీమ ప్రాంతంలో పర్యటనతో పాటు గోదావరి జిల్లాలలో కలియతిరుగుతున్నారు.
ఈ సందర్భంగా జగన్ మీద బాబు డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. ఏపీలో అసమర్ధ పాలన సాగుతోంది అని నిప్పులు చెరుగుతున్నారు. ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చి జగన్ ఏకంగా ఏపీని అప్పులు పాలు చేశారు. ఈ రోజుకు ఏపీలో ప్రతి ఒక్కరి నెత్తిన 2.70 లక్షల రూపాయల అప్పు ఉందని బాబు లెక్క కట్టి మరీ చెప్పారు. ఇదే జగన్ని మరోసారి ఎన్నికుంటే ఇక ఇంతే సంగతులు అని బాబు తేల్చేశారు.
ఏపీకి జగన్ పాలన వద్దూ ని తాను నెత్తీ నోరు మొత్తూ 2019 ఎన్నికల ముందు చెబితే మీరు విన్నారా అంటూ జనాలకు ఫ్లాష్ బ్యాక్ కధలు చెబుతున్నారు. దాని ఫలితం ఇపుడు చూశారు కదా ఇపుడైనా నా మాట వింటారా అని వారిని రెట్టిస్తున్నారు. మీరు జగన్ని మళ్ళీ ఎన్నుకోవాలని చూస్తే మాత్రం ఇక మీ భవిష్యత్తు గురించి పూర్తిగా మరచిపోవచ్చు అని బాబు బాగా భయపెట్టి మరీ జనాలకు చెప్పాల్సినవి చెప్పేస్తున్నారు.
ఏపీని జగన్ చేసిన నాశనం అంతా ఇంతా కాదు, మీరు 2024లో నాకు అధికారం అప్పగించినా వైసీపీ చేసిన అప్పుల కుప్ప ఏపీని అయిదేళ్ళలో లేపడం సాధ్యపడదని బాబు అంటున్నారు. ఏపీని గాడిన పెట్టడానికి కచ్చితంగా మరో పదేళ్ల కాలం పడుతుందని బాబు చెబుతున్నారు. అంటే 2024 ఎన్నికలే కాదు 2029 ఎన్నికలలో కూడా తనకే ఓటు వేయాలని బాబు జనాలను కోరుతున్నారన్న మాట.
మరి లాస్ట్ చాన్స్ చివరి అవకాశం అని చంద్రబాబు జనాలను కోరుతున్నారు అని అనుకోవచ్చు. కానీ లాస్ట్ చాన్స్ అంటూ 2024లో పవర్ అప్పగిస్తే అది మరిన్ని చాన్సులు చేసుకోవడం ఎలాగో బాబు కంటే మరెవరికీ తెలియదు అని అనడానికే ఈ పదేళ్ల ప్లానింగ్ అని అంటున్నారు. ఏపీలో చూస్తే వైసీపీ ఏలుబడి దారుణంగా ఉంది అని విపక్షాలు అంతా అంటున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం తాను రిపేర్లు కూడా చేస్తాను కానీ పట్టే సమయం కచ్చితంగా రెండు ఎన్నికల కాలం అంటున్నారు.
మరి ఏపీలో బాబు అనుభవాన్ని చూసి మరోసారి జనాలు అవకాశం ఇస్తారా. అంతే కాదు ఆయన చెప్పినట్లుగా 2024, 2029లో కూడా ఏపీలో తెలుగుదేశాన్ని గెలిపించుకుని రాష్ట్రాన్ని బాబు మార్క్ మోడల్ స్టేట్ గా స్వర్గధామంగా చేసుకుంటారా అంటే జనాల మదిలో ఏముందో చూడాల్సిందే. ఏది ఏమైనా చంద్రబాబు ప్రకటనలూ ఆయన ఇస్తున్న బోల్డ్ స్టేట్మెంట్స్ మాత్రం ఏపీలో ఉన్న ఇద్దరు యువ నాయకులు జగన్ బాబుకు ఇక శాశ్వతంగా అధికారం దూరం చేయడానికే అన్నట్లుగా ఊన్నాయని అంటున్నారు.
తన అనుభవం కార్డుని మరోసారి బయటకు తీయడం ద్వారా పవన్ ఒక్క చాన్స్ కి బాబు గండి కొట్టాలనుకుంటున్నారు. అలాగే ఏపీని జగన్ పూర్తిగా నాశనం చేశారు కాబట్టి తనకు మరమ్మతులకు రెండు చాన్సులు ఇవ్వాలని కోరుతున్నారు. మరి ఏపీ జనాల తీర్పు దీని మీద ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఏమైనా ఒక్క మాట చెప్పాలంటే బాబుని రాజకీయ గడసరిగానే అభివర్ణించాలి. లేకపోతే లాస్ట్ చాన్స్ అంటూ ఒకటికి రెండు చాన్సులు అడిగే లీడర్ ఆయన తప్ప వేరెవరు ఉంటారు మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.