విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని తన పర్యటనలో కాళ్ల మండలం పెద అమిరంలో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
కాగా ఈ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ పలువురికి ఆహ్వానాలు పంపింది. అతిథులుగా హాజరుకావాలని కోరింది. ఇందులో భాగంగా ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తదితరులకు ఆహ్వానం పంపారు.
అయితే చంద్రబాబు నాయుడికి బదులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఆయనకు తీవ్ర అవమానం ఎదురైందని తెలుస్తోంది. భీమవరంలో హెలిప్యాడ్ లో ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం పలికే క్రమంలో అచ్చెన్నాయుడుకి అవమానం జరిగింది.
వాస్తవానికి అచ్చెన్న నాయుడును కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి హెలిప్యాడ్‌కు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. అయితే తమకు వచ్చిన జాబితాలో అచ్చెన్నాయుడు పేరు లేదని జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ డీఐజీ ఇచ్చిన జాబితాలో అచ్చెన్నాయుడు పేరు ఉంది.
ఈ విషయం జిల్లా కలెక్టర్‌కు చెప్పినప్పటికీ తన జాబితాలో అచ్చెన్నాయుడు పేరు లేదని తేల్చిచెప్పేశారని సమాచారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినా జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంపై కేంద్ర అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
కలెక్టర్ జాబితాలో పేరు లేదని చెప్పడంతో బస చేసిన ప్రాంతంలోనే అచ్చెనాయుడు ఆగిపోయారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహ్వానించి అవమానించడం ఏమిటని మండిపడుతున్నారు.