అసీస్ బౌలర్ ట్యాంపరింగ్.. నిజమేనా?

Update: 2019-06-10 05:13 GMT
ట్యాంపరింగ్ వివాదంతో ఆస్ట్రేలియా క్రికెట్ ఇప్పటికే భ్రష్టుపట్టిన సంగతి తెలిసిందే. గతఏడాది దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా అప్పటి కెప్టెన్ స్మిత్, ఓపెనర్ వార్నర్ బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడి ప్రపంచ క్రికెట్ లో ఆస్ట్రేలియాకు చెడ్డ పేరు తెచ్చారు. సంవత్సరం సస్పెన్షన్ కు గురయ్యారు.. ఆ వివాదాన్ని మరిచిపోకముందే ఇప్పుడు మరో ఆస్ట్రేలియా స్పిన్నర్ చేసిన పని అనుమానాలకు తావిస్తోంది.

ఇండియాతో నిన్న ఆస్ట్రేలియా తలపడి ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్ చేసే ముందు ప్రతి బంతికి జేబులో చేతులు పెట్టుకొని ఆ తర్వాత బాల్ విసిరాడు.  జేబులో ఏమో పెట్టుకొని ట్యాంపరింగ్ చేశాడా అన్న అనుమానాలు బలపడ్డాయి. నెటిజన్లు అతడి వీడియోలు, ఫొటోలను రిలీజ్ చేసి ప్రశ్నల వర్షం కురిపించారు. జంపా తీరు కూడా ట్యాంపరింగ్ చేసినట్టు కనిపించింది.

అయితే అసీస్ టీం మేనేజ్ మెంట్ ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చింది. చేతిని వేడిగా ఉంచుకోవడం కోసం హ్యాండ్ వార్మర్ సాధనాన్ని జంపా వినియోగిస్తాడని.. బిగ్ బాష్ లీగ్ తోపాటు అంతర్జాతీయ మ్యాచుల్లో ఇలా చల్లని వాతావరణంలో జంపా ఇలా చేస్తాడని అసీస్ తెలిపింది.

అసీస్ కెప్టెన్ ఫించ్ కూడా దీనిపై స్పందించాడు. జంపా జేబులో హ్యాండ్ వార్మర్ ఉందని.. బాల్ పై పట్టు కోసం దాన్ని ఉపయోగిస్తాడని తమకు తెలుసు అని క్లారిటీ ఇచ్చారు. ఇది బాల్ ట్యాంపరింగ్ కాదని తెలిపాడు.


Tags:    

Similar News