బీజేపీ సోషల్ మీడియా గతి తప్పుతోందా అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం ఇటీవల చేస్తున్న పోస్టులు, ట్వీట్లు చూస్తున్నవారికి ఇదే అనుమానం కలుగుతోందని చెబుతున్నారు. ప్రజలకు అవసరమైన అంశాలను వదిలేసి అనవసరమైన అంశాలను పట్టుకుని వేలాడతోందంటూ బీజేపీ సోషల్ మీడియాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాగయితే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ దారుణంగా నష్టపోకతప్పదని అంటున్నారు.
ఇందుకు ఉదాహరణగా విశ్లేషకులు రాహుల్ టీ షర్ట్ వ్యవహారాన్ని చూపుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 3,500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయనున్నారు. తమిళనాడులోని త్రివేణి సంగమం అయిన కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం తమిళనాడులో టూరు ముగించుకున్న రాహుల్ పాదయాత్ర కేరళ చేరుకుంది. కేరళలో 18 రోజులు రాహుల్ పాదయాత్ర చేయనున్నారు.
దీంతో రాహుల్ గాంధీ పాదయాత్రకు వివిధ వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. రాహుల్ కూడా ఎక్కడికక్కడ తన పాదయాత్రలో మహిళా కూలీలు, వలస కూలీలు, రైతులు, విద్యార్థులు, మైనారిటీలు, వృద్ధులు, ఉద్యోగులు, యువకులు ఇలా అన్ని వర్గాల వారితో ముచ్చటిస్తున్నారు. దేశ పరిస్థితులను వారితో చర్చిస్తున్నారు. కొన్ని విషయాలను వారినడిగి తెలుసుకుంటున్నారు. దీంతో రాహుల్ పాదయాత్రకు ప్రజల్లో మంచి సానుకూలత వ్యక్తమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
దీంతో బీజేపీ అధిష్టానం, ఆ పార్టీ పెద్దలు గంగవెర్రులు ఎత్తుతున్నారని చెబుతున్నారు. మొదట్లో రాహుల్ పాదయాత్రను బీజేపీ పెద్దలు పూచికపుల్లలా తీసిపారేశారు. అయితే రోజురోజుకి రాహుల్ పాదయాత్రకు ప్రజలు వెల్లువలా పోటెత్తడం, వివిధ వర్గాల ప్రజల్లో సానుభూతి వ్యక్తం కావడంతో బీజేపీలో వణుకు మొదలయిందని అంటున్నారు.
దీంతో పాదయాత్రలో రాహుల్ గాంధీ రూ.41 విలువైన బర్బెర్రీ టీ షర్టు ధరించారని.. విదేశీ టీషర్టులు ధరిస్తున్న రాహుల్ కు దేశ ప్రజలు కష్టాలు ఏం తెలుస్తాయని బీజేపీ సోషల్ మీడియా తన అక్కసును వెల్లగక్కింది. ఈ మేరకు రాహుల్ ధరించిన తెల్లటి టీషర్ట్ ఫొటోను, దాని
దీంతో, బీజేపీకి అంతే తీవ్రంగా కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన సూటు ధరను తెర మీదకు తీసుకువచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా.. భారత్ జోడో యాత్ర సందర్భంగా వస్తున్న ప్రజా స్పందనను చూసి బీజేపీ నేతలు భయపడుతున్నారా? అంటూ కౌంటర్ ఇచ్చింది. డ్రెస్సుల గురించి కాదు.. దేశంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడండి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడండి అంటూ ఘాటు వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసింది.
అయితే బీజేపీ సోషల్ మీడియాకు కాంగ్రెస్ పార్టీయే కాకుండా నెటిజన్లు తీవ్రంగా కౌంటర్లు ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధరిస్తున్న ఒక్కో సూట్ విలువ రూ.10 లక్షలని చెబుతున్నారు. ఇక ఆయన కళ్లద్దాలు రూ.1.5 లక్షలు అని నెటిజన్లు మండిపడుతున్నారు. మరి వీటి గురించి కూడా మాట్లాడంటి అంటూ మండిపడుతున్నారు.
దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే బట్టల గురించి ప్రస్తావన ఎందుకంటూ నెటిజన్లు బీజేపీ సోషల్ మీడియాను ఏకిపారేశారు. ఓవైపు రూపాయి విలువ డాలర్ తో పోల్చిచూసుకుంటే దారుణంగా పతనమవుతోందని, ద్రవోల్బణం దారుణంగా ఉందని, నిరుద్యోగం వృద్ధి రేటు గతంలో లేనంత స్థాయికి చేరిందని, రైతులు ఇప్పటికీ గిట్టుబాటు ధరలు లభించక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఈ సమస్యలన్నింటినీ గాలికొదిలేసి బీజేపీ సోషల్ మీడియా పనికిమాలిన విషయాలు పట్టుకొస్తోందని నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ముందు రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పతనం, మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థ, విదేశీమారక ద్రవ్యనిల్వలు అంతకంతకూ తగ్గిపోవడం వంటివాటిపై బీజేపీ మాట్లాడాలని నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల 75 జాతీయ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహించారని.. అయితే జాతీయ జెండాలను కూడా చైనా నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితికి దేశాన్ని బీజేపీ ప్రభుత్వం దిగజార్చిందని మండిపడుతున్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు తరలివచ్చిన జనాన్ని చూసి బీజేపీ జడుసుకుందని, ఆ పార్టీ వెన్నులో వణుకు పుట్టిందని దీంతో విమర్శించడానికి ఏమీ లేక రాహుల్ టీ షర్ట్ రచ్చ చేస్తోందని నెటిజన్లు బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.