యాంటీ బయాటిక్స్ వల్లే బ్లాక్ ఫంగస్ సోకుతోందా !

Update: 2021-05-25 13:30 GMT
కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. అసలు కరోనా మహమ్మారి విజృంభణ అయితే కొనసాగుతుంది. కానీ, ఎన్ని వేరియేషన్స్ వస్తున్నాయి , ఎలా వస్తున్నాయి. అలాగే వ్యాక్సిన్ ఆ వేరియంట్ల పై ఎలా పని చేస్తుందో చెప్పడం కష్టంగా మారుతోంది. అలాగే కరోనా గురించి చెప్పే నిపుణులు , వైద్యులు కూడా ఈ రోజు చెప్పింది , రేపు చెప్పడం లేదు. రోజుకో మాట చెప్తున్నారు.  కరోనా వైరస్ కు అనుబంధంగా బయటకు వచ్చిన బ్లాక్ ఫంగస్ వ్యవహారం కూడా ప్రస్తుతం ఇదే ధోరణి లో వుంది. నిన్న మొన్నటి వరకు కరోనా వైరస్ ట్రీట్ మెంట్ లో స్టెరాయిడ్స్ ఎక్కువ వాడడం వల్ల, డయాబిటిక్ పేషెంట్లకు గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ లో లేకపోవడం వల్ల బ్లాక్ ఫంగస్ సోకుతోందని అన్నారు.

అలాగే, మరో ముఖ్యమైన కారణం కరోనా సోకకుండా వాడే పేస్ మాస్కులు మార్చుకుండా వాడడం కూడా ఓ రీజన్ అని కూడా అన్నారు. కానీ ఈ రోజు తాజాగా మరో అధ్యాయనం ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. ఇవి పూర్తిగా భిన్నంగా వున్నాయి. ఇండోర్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ జయదేవన్ 200 మంది బ్లాక్ ఫంగస్ పేషెంట్లపై పరిశోధన చేసారు. చిత్రంగా వీరిలో 42 మందికి డయాబెటీస్ లేదు. 28 మంది స్టెరాయిడ్స్ వాడలేదు. 72 మంది ఆక్సిజన్ తీసుకోలేదు. 110 మంది మాత్రమే ఆక్సిజన్ తీసుకున్నారు.  ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ..  ఈ పేషెంట్లు అందరూ  కూడా యాంటీ బయాటిక్స్ వాడిన వారే. అంటే ఇప్పుడు కొత్త అనుమానం ఏమిటంటే డయాబెటిక్స్, స్టెరాయిడ్స్, ఆక్సిజన్ వినియోగం కన్నా యాంటీ బయాటిక్స్ వినియోగం వల్ల బ్లాక్ ఫంగస్ సోకుతోందా అన్నది. ఇప్పటికి .  ఇది, రేపో, ఎల్లుండో మరో పరిశోధన ఎవరో ఒకరు చేసారు. ఇంకో రకమైన రీజన్లు, లాజిక్ లు బయటకు వస్తాయి. ఇప్పటి వరకు ప్రపంచంలో బయటకు వచ్చిన వైరస్ ల్లో కరోనా అంతటి విపత్కరమైన వైరస్ మరొకటి లేదు.
Tags:    

Similar News