ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం రాజోలులో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. నిన్న మొన్నటి వరకు వైసీపీ తరఫున రాజకీయం చేసిన.. బొంతు రాజేశ్వరరావు.. ఇప్పుడు జన సైనికుడిగా మారిపోయారు. తాజాగా ఆయనజనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రాజోలు నుంచి ఆయనే పోటీ చేస్తారనే ప్రచారం ఉంది.
అయితే, ఇక్కడ మరో చిక్కు కూడా ఉంది. ఇదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన మరో నేత కూడా ఉన్నారు. ఆయనే మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్. ఈయన ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. ఈయన కూడా రాజోలు నుంచి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ఎవరికి టికెట్ ఇస్తారనేది ఆసక్తిగా ఉన్నప్పటికీ.. రాజోలులో అంతో ఇంతో బొంతుకు ప్రాధాన్యం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకే టికెట్ ఇస్తారని ప్రచారం అయితే సాగుతుండడం గమనార్హం.
2019 ఎన్నికలను తీసుకుంటే.. జనసేన నుంచి రాపాక వరప్రసాద్ పోటీ చేశారు. ఈయనకు 50,053 ఓట్లు పడ్డాయి. ఇక, ప్రస్తుతం జనసేనలో చేరిన బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేశారు. ఆయనకు 49,239 ఓట్లు వచ్చాయి.
ఇక, టీడీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు పోటీ చేయగా.. ఆయన మూడో స్థానంలో సరిపెట్టుకుని 44,592 ఓట్లు తెచ్చుకున్నారు. అంటే.. మొత్తానికి ఈ సీటులో ఫైట్ హోరా హోరీగానే సాగిందని చెప్పాలి.
ఇక, ఇప్పుడు అభ్యర్థులు తారమయ్యారు. బొంతు జనసేనలోకి రాగా, రాపాక వైసీపీ తరఫున టికెట్ క న్ఫర్మ్ చేసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. టీడీపీ అభ్యర్థి ఎవరనేది తెలియాల్సి ఉంది. అయితే.. ఈ సారి.. జనసేలో ఇద్దరు అభ్యర్థులు వరప్రసాద్, బొంతు పోటీ పడుతున్నప్పటికీ.. గత అనుభవం రీత్యా బొంతుకు టికెట్ ఇస్తే.. బెటర్ అనేది పార్టీ వర్గాల మాట.
ప్రస్తుతం ఆయన లీడ్‌లో నే కొనసాగుతున్నారు. ఇక, వైసీపీలో ఉన్న అంతర్గతకుమ్ములాటలు కూడా బొంతుకు కలిసివస్తే.. ఆయన గెలుపును జనసేన రాసిపెట్టుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.