సీబీఐ విచారణ అవసరమా ?

Update: 2022-04-09 07:31 GMT
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ అరెస్టు చేయటం, విచారణ తదనంతర పరిణామాలపై సీబీఐ విచారణ అవసరమా ? అని సుప్రింకోర్టు డైరెక్టుగానే ప్రశ్నించింది. తన తండ్రి రఘురాజును సీఐడి అధికారులు విచారణలో కొట్టారని ఎంపీ కొడుకు భరత్ సుప్రింకోర్టులో పిటీషన్ వేశారు. సీఐడీ ట్రీట్మెంట్ తదనంతర పరిణామాలపై సీబీఐ లేదా మరో స్వతంత్ర సంస్ధతో విచారణ జరిపించాలని భరత్ తన పిటీషన్లో రిక్వెస్టు చేసుకున్నారు.

 ఇదే విషయమై జరిగిన విచారణలో సుప్రింకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతు ఘటన జరిగి 11 నెలలు అయిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. ఎప్పుడో జరిగిపోయిన ఘటనపై  ఇపుడు సీబీఐ విచారణ అవసరమా అని సూటిగా ప్రశ్నించింది. దానికి పిటీషనర్ తరపు లాయర్ ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. ఘటన జరిగి 11 మాసాలైనా ఇప్పటివరకు వరుసగా కోర్టులో విచారణ జరగలేదని లాయర్ గుర్తుచేశారు. అందుకనే తన క్లైంటుకు న్యాయం జరగేందుకే సీబీఐ విచారణ కోరుతున్నట్లు లాయర్ తెలిపారు.

 రెండువైపుల వాదనలు విన్నతర్వాత న్యాయమూర్తులు వీలైనంత తొందరగా ఈ కేసును రెగ్యులర్ గా విచారణ చేస్తామని హామీఇచ్చారు. అలాగే  పిటీషనర్ లాయర్ వాదన ప్రకారం సీబీఐ, కేంద్రప్రభుత్వానికి నోటీసులివ్వాలని ఆదేశించారు.

ఈ కేసుకు సంబందించి రెండువారాల్లో  కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రప్రభుత్వంతో పాటు సీబీఐని ఆదేశించారు. మరి సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యాలను గమనిస్తే ఎప్పుడో జరిగిపోయిన రఘురామ ఎపిసోడ్ విషయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్నట్లుగానే ఉంది.

మరి పిటీషనర్ మాత్రం సీబీఐ లేదా స్వతంత్ర సంస్ధ విచారణ కావాల్సిందే అని పట్టుబడుతున్నారు. సీబీఐ కాకుండా మరో స్వతంత్రసంస్ధ అని అన్నారే కానీ సీబీఐ కాకుండా విచారణకు అలాంటి స్వతంత్రసంస్ధ అంటు ప్రత్యేకించి ఏమీలేదు.

అయితే సీబీఐ విచారణ లేదా మరీ తీవ్రమైన ఘటనలైతే జ్యూడిషియల్ విచారణ మాత్రమే మనకు అందుబాటులో ఉంది. మరి రెండువారాల తర్వాత జరగబోయే విచారణలో న్యాయమూర్తులు ఏమి డిసైడ్ చేస్తారనేది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News