రాజకీయాల్లో ఇది సాధ్యం.. అది అసాధ్యం అంటూ.. ఏదీ ఉండదు. సమయానికి తగిన విధంగా నాయకు లు పార్టీలు వ్యవహరించే తీరును బట్టి.. ఆయా పార్టీలు ముందుకు సాగుతుంటాయి. ఈ క్రమంలో విజయ మో.. పరాజయమో.. ఖాతాలో వేసుకుంటాయి. గతంలోను ఇప్పుడు .. ప్రజల సానుభూతి లేని రాజకీయా లు చూడలేం. సెంటిమెంటు.. సానుభూతి అనే రెండు పట్టాలపైనే రాజకీయాలు నాయకులు కూడా ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహా సెంటిమెంటును రెచ్చగొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
తాజాగా పవన్ వ్యాఖ్యానిస్తూ.. తాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలో రాజకీయాలు చేస్తానని.. ఆ యన లాగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తానని అన్నారు. పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశం లో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
దీంతో అసలు.. కేసీఆర్ అనుసరించిన రాజకీయాలు ఏంటి? అనే చర్చ తెరమీదికి వచ్చింది. ఆయన ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు అనుసరించారో..వేశారో.. తెలియదు కానీ.. ఒక్కటి మాత్రం నిజం. ఎప్పుడు ఎలాంటి ఎన్నికలు వచ్చినా.. తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టారు.
ప్రజల సానుభూతి ఓట్లను కారు డిక్కీలో కుక్కుకున్నారు. అంటే.. కేసీఆర్ వ్యూహాలకన్నా.. సానుభూ తి..సెంటిమెంటుకే ప్రాదాన్యం ఇచ్చారు. అదేఆయనను కూడా రెండో సారి గద్దెనెక్కేలా చేసింది.కట్ చేస్తే.. ఇప్పుడు పవన్ కూడా ఇదే మార్గం అవలంభించాల్సి ఉంది. అంటే..ఆయన కూడా.. సానుభూతి, సెంటిమెంటును తనవైపు తిప్పుకోవాలి. అయితే.. ఇప్పటికిప్పుడు ఏపీలో ఉన్న సెంటిమెంటు ఏంటి? అంటే.. ఏమీ కనిపించడం లేదు. పోనీ.. ప్రత్యేక హోదా సెంటిమెంటునైనా పవన్ నిలబెట్టుకుని ఉంటే.. బాగుండేది.
కానీ, దానిని ఆయనేవదులుకున్నారు. దీంతో ఇప్పుడు చిరంజీవి అస్త్రాన్ని తెరమీదకి తెచ్చినట్టు కని పిస్తోందని అంటున్నారు పరిశీలకులు. చిరు అంటే.. రాజకీయాలకు సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరూ అభిమానించే హీరో. ఇప్పుడు ఈయనకు అగౌరవం జరిగిందని.. సాక్షాత్తూ.. సీఎం జగన్.. అవమానించా రని.. నమస్కారం పెడితే.. ప్రతినమస్కారం కూడా పెట్టలేదని.. వ్యాఖ్యానించారు. అంతేకాదు.. చిరును రాజకీయంగా భూస్థాపితం చేసిన వారు ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారని చెప్పారు.
తద్వారా పవన్..చిరు విషయంలో సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చేశారనేది వాస్తవం. అయితే.. ఈ సెంటిమెంటు రాజకీయంగా వర్కువుట్ అవుతుందా? చిరును అభిమానించే వారు.. వైసీపీకి వ్యతిరేకంగా జనసేనకు ఓట్లు వేస్తే.. తప్పకుండా.. వర్కువుట్ అవుతుంది. కానీ, చిరును-పవన్‌ను రాజకీయంగా ఒకే వేదికపై ఇప్పటి వరకు చూడని అభిమానులు ఈ సెంటిమెంటుకు పడిపోతారని ఎవరూ అనుకోవడం లేదు. మొత్తంగా చూస్తే.. చిరు సెంటిమెంటు వర్కవుట్ కావాలంటే.. అటు నుంచే పవన్ నరుక్కురావాలనేసూచనలు వస్తున్నాయి. అంటే.. చిరు కుటుంబం నుంచే.. తమకు అవమానం జరిగిందని.. చెప్పించగలిగితే.. అప్పుడు అవకాశం ఉంటుందని అంటున్నారు.