ఏపీలో సీఎం అడ్వయిజర్స్ రిపోర్ట్స్ సరిగా లేవా..?

Update: 2021-04-08 12:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ తిరుగులేకుండా పాలన సాగిస్తోంది. ఎలాంటి ఎన్నికలొచ్చినా రేసుగుర్రంలా పరుగెడుతోంది. ప్రతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లు చేస్తూ ప్రతిపక్షాలకు నిద్రలేకుండా చేస్తోంది. అయితే కొన్ని చోట్ల పార్టీ గెలిచిందని చెప్పుకుంటున్నా వారు రెబల్ కిందకే వస్తారని అంటున్నారు. పార్టీలో టికెట్ రానివారు రెబల్ గా పోటీ చేసి గెలిచినా వారికి పార్టీ కండువా కప్పి అధిష్టానానికి ఫొటో దిగి పంపించారట కొందరు ఎమ్మెల్యేలు. దీంతో అక్కడ పార్టీ బలం కన్నా వ్యక్తుల బలం ఎక్కువగా ఉందని చర్చ జరుగుతోంది. ఇలా పార్టీ గురించి రిపోర్ట్స్ ఇచ్చే అడ్వయిజర్ సరిగా పనిచేయడం లేదట.

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దూకుడుగా విజయం సాధించింది. పరిషత్ ఎన్నికల్లోనూ అదే పంథాలో వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో భాగంగా  బీజేపీ, జనసేనకు ఓటు శాతం పెరిగిందని, టీడీపీకి ఓటు శాతం తగ్గినా ప్రజల్లో సానుభూతి పెరిగిందని సీఎం అడ్వయిజర్స్ రిపోర్ట్స్ ఇచ్చారట. అయితే అవి అక్యూరుట్ గా లేవని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే రాయలసీమ జిల్లాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అనూహ్యంగా పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ రెబల్స్ 43 శాతం గెలిచారట. ఎమ్మెల్యేలు ఇచ్చిన సీట్లలో 43 శాతం మంది ఓడిపోయారంటే వారి పనితీరులో లోపమేనని చర్చించుకుంటున్నారు.

దీంతో థర్డ్ పార్టీ ద్వారా రిపోర్ట్స్ తెప్పించుకుంటే అసలు పార్టీ గెలిచింది గానీ.. ఇంత పెద్దఎత్తున్న పార్టీపై వ్యతిరేకత ఉందని ఊహించలేదని చెప్పారట. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అంతమంది రెబల్స్ గెలిచారంటే అది పార్టీ విజయం కాదని, వారి సొంత ప్రజాబలంతోనే గెలిచారని చర్చించుకుంటున్నారట. అయితే భవిష్యత్ లో ఇదే కొనసాగితే వారు పార్టీ మారితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని అనుకుంటున్నారట. దీంతో ప్రతీ విషయంపై సీఎం నేరుగా థర్డ్ పార్టీ ద్వారా రిపోర్ట్స్ తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారట.

2019 ఎన్నికల్లో ఈ జిల్లాల్లో 90 శాతం ఎమ్మెుల్యేలు గెలిచారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల సీట్ల పరిధిలో 43 శాతం రెబల్స్ గెలవడంపై లెక్కల్లో తేడాలు వచ్చాయని సీఎం గ్రహించారట. దీంతో ఆయన థర్డ్ పార్టీనే నమ్ముకొని రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారట. అయితే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి  నుంచి కూడా సీఎం థర్డ్ పార్టీ ద్వారా సమాచారం తెప్పించుకున్నట్లు సమాచారం. మరి అది నిజమో కాదో చూడాలి..
Tags:    

Similar News