విశాఖ‌లో క‌రోనా ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోందా?

Update: 2022-07-08 06:37 GMT
దేశంలో క‌రోనా కేసులు ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తున్నాయి. నెమ్మ‌దిగా కేసులు పెరుగుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో మ‌న‌దేశంలో గ‌త 24 గంట‌ల్లో 18,930 కేసులు వెలుగుచూశాయి. ఒకే రోజు 35 మంది మ‌ర‌ణించ‌డం అంద‌రిలో గుబులు రేపుతోంది.

ఇదిలా ఉండ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విశాఖ‌ప‌ట్నంలో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. వరుసగా గత మూడు రోజులుగా వంద దాటి కరోనా కేసులు విశాఖలో నమోదు అవుతుండ‌టంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. రెండు నెలల ముందు పదుల లోపు కేసులు నమోదు అయ్యాయి. ఒక దశలో ఈ కేసులు పూర్తిగా త‌గ్గిపోయి జీరో నంబర్ కు ద‌గ్గ‌ర‌య్యాయి. దీంతో హ‌మ్మ‌య్య అని ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఇంత‌లోనే ప్ర‌జ‌ల ఆనందాన్ని ఆవిరి చేస్తూ ఇప్పటిదాకా 50లోపుగా ఉంటూ వ‌చ్చిన కేసులు గ‌త మూడు రోజుల నుంచి వేగంగా పెరిగిపోయాయి. ఈ క్ర‌మంలో గ‌త మూడు రోజుల నుంచి రోజూ 100 కేసుల చొప్పున న‌మోద‌వుతున్నాయి. దీంతో ఆరోగ్య‌, వైద్య విభాగాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. విశాఖ అధికారులు కూడా క‌రోనా కేసులు మ‌రింత వ్యాప్తి చెంద‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టారు.

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్ర‌జ‌ల‌కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో మాస్కులు పెట్టుకోవాల‌ని సూచిస్తున్నారు. అలాగే కరోనా ప్రోటోకాల్ ని అందరూ పాటించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

ప్రస్తుతం జిల్లాలో ప్రతిరోజూ సుమారు 1200 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచాల్సిందిగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. వైరస్‌ సోకిన వ్యక్తుల్లో స్వల్ప లక్షణాలే ఉంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వైరస్‌ బారిన పడుతున్న వ్యక్తుల్లో జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు మాత్రమే ఉంటున్నాయని, జిల్లాలో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

మ‌రోవైపు కరోనా కేసులు పెరుగుతున్న తీరు నాలుగో వేవ్‌కు సంకేతంగా భావించాల్సిన ఉందని వైద్యులు చెబుతున్నారు. రెండో డోస్‌ తీసుకుని నెలలు దాటిన చాలామందిలో యాంటీబాడీలు తగ్గిపోవడంతో మరోసారి వైరస్‌ బారినపడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
Tags:    

Similar News