ఆప్ కు క్రేజ్ పెరుగుతోందా?

Update: 2022-09-13 05:30 GMT
పంజాబ్ లో పెరుగునట్లే గుజరాత్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి క్రేజ్ బాగా పెరుగుతున్నట్లే ఉంది. మూడు రోజుల పర్యటన నిమ్మితం ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో పర్యటన మొదలుపెట్టారు. అహ్మదాబాద్ లోని వివిధ ట్రేడ్ యూనియన్లతో పాటు ఆటోరిక్షా డ్రైవర్ల సంఘాలతో సమావేశమయ్యారు. పంజాబ్ లో ఆప్ కు మద్దతిచ్చినట్లే ట్రేడ్ యూనియన్లు గుజరాత్ లో కూడా మద్దతివ్వాలని రిక్వెస్టు చేసుకున్నారు. అందుకు చాలా యూనియన్లు సానుకూలంగా స్పందించాయి.

యూనియన్ నేతలతో ఒక హోటల్లో కేజ్రీవాల్ నిర్వహించిన ముఖాముఖి సమావేశం బాగా సక్సెస్ అయినట్లు ఆప్ ట్విట్టర్లో ప్రకటించింది. ఇదే సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ ఘటన జరిగింది. ఒక ఆటో డ్రైవర్ కేజ్రీవాల్ తో మాట్లాడుతు తనింటికి భోజనానికి వస్తారా ? అని అడిగారు.

కేజ్రీవాల్ కు తాను పెద్ద ఫ్యాన్ అని తనను తాను పరిచయటం చేసుకున్నారు. పంజాబ్ ఎన్నికల సందర్భంగా అక్కడ కూడా ఒక ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సంగతిని ఆటోడ్రైవరే గుర్తుచేశారు.

ఆటో డ్రైవర్ ఆహ్వానానికి కేజ్రీవాల్ సానుకూలంగా స్పందించి రాత్రి 8 గంటలకు ఇద్దరు నేతలతో కలిసి భోజనానికి వస్తానని మాటిచ్చారు. తన హోటల్ కు వచ్చి ముగ్గురిని ఇంటికి తీసుకెళ్ళాలని కేజ్రీవాల్ అనగానే డ్రైవర్ సంతోషంగా ఓకే చెప్పారు.

రాత్రి 8 గంటల ప్రాంతంలో  కేజ్రీవాల్ సదరు డ్రైవర్ ఇంటికి భోజనానికి వెళ్ళారు. ఎన్నికల సమయం అందులోను బహిరంగంగా ఇచ్చిన మాట కాబట్టి కేజ్రీవాల్ తన సహచరులతో కలిసి భోజనానికి వెళ్ళి సుమారు అర గంటపాటు ఆటోడ్రైవర్ ఇంట్లో గడిపారు.

మొత్తం మీద గుజరాత్ లో కూడా ఆప్ కు బాగా క్రేజ్ పెరుగుతోందనటానికి కేజ్రీవాల్ పర్యటనలే నిదర్శనాలు. ఢిల్లీ సీఎం ఎక్కడ సమావేశాలు పెట్టినా, ఎక్కడ రోడ్డుషోలు నిర్వహించినా జనాలైతే బాగానే రెస్పాండ్ అవుతున్నారు. ఇందుకేనేమో బీజేపీ కేజ్రీవాల్ అంటే ఉలిక్కిపడుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News