ఇండియా లో ప్రతి మనిషి 50 కేజీల అన్నం పడేస్తున్నాడా .. ఎందుకో ?

Update: 2021-03-06 06:44 GMT
 అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఈ ప్రపంచంలో అత్యధిక ప్రజలు ప్రధానంగా తీసుకునే ఆహారం అన్నమే. మూడు పూటల్లో కనీసం ఒక్క పూటైనా అన్నం తింటేనే కడుపు నిండుగా ఉంటుంది. శరీరానికి కావల్సిన శక్తి, కార్బోహైడ్రేట్లు కూడా అందుతాయి. మూడు పూట్ల అన్నం తినే వారు చాలామంది ఉన్నా కూడా, రోజులో ఒక్క పూట కూడా అన్నం తినలేని వారు ఎంతో మంది ఉన్నారు. దేశంలో ఎంతోమంది సంపన్నులు ఉన్నప్పటికీ , అలాగే పేదవారు కూడా ఉన్నారు.

ఇదిలా ఉంటే .. ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఆహారం వృధా అవుతుంది అని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.  ప్రపంచవ్యాప్తంగా 2019లో 931 మిలియన్ల టన్నుల ఆహారం చెత్తబుట్ట పాలైంది. 40 టన్నుల బరువున్న 23 మిలియన్ల ట్రక్కులను పూర్తిగా నింపొచ్చు. ఈ మొత్తం వృథాలో భారత్ వాటా 68 మిలియన్ల టన్నుల పైమాటే, ప్రపంచవ్యాప్తంగా వృథా అవుతున్న ఆహారం ఏ స్థాయిలో ఉందో కళ్లకు కట్టేందుకు ఐక్యరాజ్య సమితి ఈ తీరుగా విశ్లేషించింది.  భారత్ ‌లో తలసరిగా ఒక సంవత్సరంలో ఒక ఇంటి నుంచి 50 కేజీల ఆహారాన్ని చెత్త బుట్టలో వేస్తున్నారని అంచనా వేసింది.

మొత్తంగా మన దేశంలో పారబోస్తున్న ఆహారపదార్థాలు 68 మిలియన్ల టన్నులకు పైబడ్డాయి. అది అమెరికాలో 59 కేజీలుగా ఉండగా.. చైనాలో 64 కేజీలుగా తేలింది. ఆదాయ స్థాయులతో సంబంధం లేకుండా ప్రతి దేశంలో ఆహారపదార్థాలు వృథా అవుతున్నాయని సమితి ఆందోళన వ్యక్తం చేసింది.  ఈ వృథాను తగ్గించడం ద్వారా గ్రీన్ హౌస్ ఉద్ఘారాలను తగ్గించవచ్చు. ప్రకృతి విధ్వంసం నెమ్మదిస్తుంది. ఆహార లభ్యత పెరిగి, ఆకలితో బాధపడేవారి సంఖ్య తగ్గుతుంది. ఆర్థిక మాంద్యం సమయంలో డబ్బు ఆదా అవుతుంది’ అంటూ ఆహారం సరిగా వినియోగించుకుంటే కలిగే ప్రయోజనాలను యూఎన్‌ఈపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండర్సన్ విశ్లేషించారు.
Tags:    

Similar News