గులాబీ కోటలో మంత్రి వర్సెస్ మండలి చైర్మన్

Update: 2019-11-28 08:12 GMT
ఆధిపత్యంతో మరోసారి గులాబీ గూటిలో పంచాయతీ మొదలైంది. నల్గొండ జిల్లాలో ఇప్పుడు రాజకీయం రసవత్తరంగా మారింది. మంత్రిగా ఇన్నాల్లు నల్గొండ ఉమ్మడి జిల్లాలో జగదీశ్ రెడ్డిది ఏకచ్ఛత్రాధిపత్యం. ఇప్పుడు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ పాలిటిక్స్ లో ఎంటర్ కావడంతో గులాబీల్లో చిచ్చు రేగుతోంది. రాజ్యాంగ పదవిలో ఉన్న గుత్తా నల్గొండ పాలిటిక్స్ లో దూరంగా ఉంటారని భావిస్తే ఆయన ప్రత్యర్థులు మాత్రం పర్యటనల మీద పర్యటనలు సాగిస్తూ మంత్రి జగదీశ్ రెడ్డికి చెక్ పెడుతున్నారట..

గుత్తాకు కీలకమైన మండలి చైర్మన్ పదవి వచ్చినప్పటి నుంచి మంత్రి జగదీశ్ రెడ్డికి ఆయనకు పొసగడం లేదన్న చర్చ జిల్లాలో నడుస్తోంది. అయితే ఇద్దరు నేతలు పైకి కలిసే ఉన్నాం అని ఫోజులిస్తున్నారట..

వారంలో 5 రోజుల పాటు గుత్తా నల్గొండ జిల్లాలోనే ఉండడం.. ప్రజల మధ్య తిరుగుతుండడంతో మంత్రి వర్గం ఆందోళన చెందుతోంది. సొంత కేడర్ ను కాపాడుకొని వచ్చేసారి మంత్రి పదవి కొట్టడానికే గుత్తా ఇలా నల్గొండలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నాడనే అనుమానాలు మంత్రి జగదీశ్ రెడ్డి వర్గంలో ఉన్నాయట.. ఈ పరిణామం మంత్రి జగదీశ్ రెడ్డి వర్గానికి మింగుడుపడడం లేదు.

గుత్తాకు కేసీఆర్ మంత్రి పదవి ఇస్తానని.. మాట ఇచ్చి సమీకరణాల నేపథ్యంలో నెరవేర్చలేకపోయారు. దీంతో ఇప్పుడు వచ్చేసారి ఖచ్చితంగా బరిలో ఉన్నారు. ప్రస్తుతం గుత్తా పర్యటనలు మంత్రి జగదీష్ వర్గానికి ఆందోళన కలిగిస్తున్నాయట.. ఇద్దరు నేతల పోటాపోటీ పాలిటిక్స్ తో నల్గొండ రాజకీయాలు హీటెక్కాయని సమాచారం.
    

Tags:    

Similar News