మెటా పేరును కాపీ కొట్టిన ఫేస్ బుక్..! అందులో నిజమేంత..?

Update: 2021-11-08 23:30 GMT
మెటా పేరును కాపీ కొట్టిన ఫేస్ బుక్..! అందులో నిజమేంత..?
  • whatsapp icon
రామేశ్వరం పోయినా శనేశ్వరం వదల లేదన్నట్లు తయ్యారైంది  ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజమైన  ఫేస్ బుక్ పరిస్థితి. ఇటీవల కాలంలో తగిలిన  వరుస ఎదురు దెబ్బల నుంచి ఇప్పటికే కోలుకోక ముందే మరో వివాదం వచ్చి పడింది.  నిన్న మొన్నటి వరకు యూజర్లకు సంబంధించిన విలువైన సమాచారాన్ని లీక్ చేసింది అన్న ఆరోపణల హీటు చల్లారాక ముందే... మరో ఊపిరి పీల్చుకోలేని మరో వివాదంలో చిక్కుకుంది.  ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ ఎంతో  ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫేస్ బుక్ మాతృసంస్థ సంస్థ పేరును మెటాగా మార్చారు. రీబ్రాండింగ్ పేరుతో దానిని పూర్తిగా రూపురేఖలు ఛేంజ్ చేశారు. అయితే కొత్తగా ఏర్పడిన వివాదం అంతా  ప్రస్తుతం మార్చిన పేరు మీదే తిరుగుతుంది. మెటా అనేది  ఫేస్ బుక్ సొంతం కాదని, దానిని ఫేస్ బుక్ దొంగలించిందని చికాగో లోని ఓ సంస్థ ఆరోపిస్తోంది. దీనిపై కోర్టుకు వెళ్లేందు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.  

చికాగోకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ అయిన  మెటా  అనే సంస్థ.. తమ కంపెనీ పేరును ఫేస్ బుక్ కాపీ కొట్టినట్లు ఆరోపించింది.  తమకు మాత్రమే చెందిన ఈ పేరును మార్కు జూకర్ బర్గ్  దొంగిలించిందని విమర్శించింది. దీనికి గానూ ఆ సంస్థపై  కోర్టును ఆశ్రయించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నేట్ స్క్యూలిక్  మీడియాకు ఇచ్చిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు సంస్థ అధినేత అయిన మార్క్ జూకర్ బర్గ్ కు నోటీసులు పంపాలని నిశ్చియించుకున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ వార్త  జూకర్ బర్గ్ ను మరింత ఇబ్బంది పెట్టేలానే ఉందని అక్కడి   నిపుణులు చెప్తున్నారు.

ముందుగా ఫేస్ బుక్ తన సంస్థను కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లు స్క్యూలిక్ తెలిపారు.  అందుకు తాము మొగ్గు చూపకపోయేసరికి తమకు జీవనాధారమైన కంపెనీ బ్రాండ్ ను తన సొంతం చేసుకున్నట్లు చెప్పకొచ్చారు. అంతేగాకుండా తమకు ఉన్న మీడియా ప్రామాణికంగా చేసుకొని ఈ సమస్యను పక్కకు నెట్టి వేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఫేస్ బుక్ బయటకు కనిపించేంత మంచిది కాదు అని అన్నారు నేట్. వారు చెప్పిందానికి.. చేసేదానికి పూర్తిగా పొంతనే ఉండదని తెలిపారు.

కనీసం నాలుగు నెలలుగా  ఫేస్ బుక్ ప్రతినిధులు రోజూ తమను కలుస్తూ.. కారు చౌకగా సంస్థను అమ్మేయాలంటూ ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.  తాము అందుకు లొంగకపోయేసరికి ఏకంగా గత నెలలో సరాసరి మెటాగా పేరు మార్చినట్లు వెల్లడించారు. దీనిపై కచ్చితంగా తాము కోర్టును ఆశ్రయించి తీరుతామని చెప్పారు. ఇటీవల కాలంలో ఫేస్ బుక్ పే  భారీ స్థాయిలో అరోపణలు వెలువెత్తుతున్నాయి. గత వారం లో ప్రముఖ ఫోటో  ఎడిటింగ్ యాప్ ఫోటో కూడా ఇలాంటి ఆరోపణలు చేసింది. తమ కంపెనీకు చెంది ఓ ఫీచర్ను  ఇన్ స్టాగ్రమ్, ఫేస్బుక్ లు క్లోన్ చేసినట్లు పేర్కొంది ఫోటో.
Tags:    

Similar News