ఈసారి గంటా శ్రీనివాస‌రావు నెల్లిమ‌ర్ల నుంచి పోటీ చేస్తున్నారా?

Update: 2022-06-20 14:30 GMT
గంటా శ్రీనివాస‌రావు ఓట‌మి ఎరుగ‌ని యోధుడు. అందులోనూ వివిధ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి వివిద పార్టీల త‌ర‌ఫున గెలిచిన అరుదైన నేత‌. ప్ర‌స్తుతం విశాఖ ఉత్త‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.. గంటా శ్రీనివాస‌రావు. ఈసారి 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌న‌గ‌రం జిల్లా నెల్లిమ‌ర్ల నుంచి పోటీ చేస్తార‌ని వార్తలు వ‌స్తున్నాయి.

ప్ర‌స్తుతం వైఎస్సార్సీసీ త‌ర‌ఫున నెల్లిమ‌ర్ల నుంచి బొత్స అప్ప‌ల న‌ర‌స‌య్య ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయ‌న విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సోద‌రుడు. బొత్స అప్ప‌ల స‌ర‌స‌య్య తూర్పు కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు.

ఇక గంటా శ్రీనివాస‌రావు కూడా కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే. 1999లో రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన గంటా శ్రీనివాస‌రావు అన‌కాప‌ల్లి ఎంపీగా టీడీపీ త‌ర‌ఫున ఘ‌న‌విజ‌యం సాధించారు. 2004 ఎన్నిక‌ల్లో విశాఖ‌ప‌ట్నం జిల్లా చోడ‌వ‌రం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇక 2009లో ప్ర‌జారాజ్యం పార్టీలో చేరిన గంటా శ్రీనివాస‌రావు అన‌కాప‌ల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ప్ర‌జారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీన‌మ‌య్యాక కొంత‌కాలం రోశ‌య్య‌, కిర‌ణ్ కుమార్ రెడ్డి మంత్రివ‌ర్గాల్లో మంత్రిగా ప‌నిచేశారు. ఇక 2014 ఎన్నిక‌ల్లో విశాఖ‌ప‌ట్నం జిల్లా భీమిలి నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా గెలిచి చంద్ర‌బాబు నాయుడు మంత్రివ‌ర్గంలో మంత్రిగా ప‌నిచేశారు.

ఇలా ఎన్నిక‌లు జ‌రిగిన ప్ర‌తిసారీ నియోజ‌క‌వ‌ర్గాలు మార్చ‌డం, అవ‌స‌ర‌మైతే పార్టీలు కూడా మార‌డం చేస్తుంటారు.. గంటా శ్రీనివాస‌రావు. ఇలా ఇప్ప‌టివ‌ర‌కు నెల్లిమ‌ర్ల‌, అన‌కాప‌ల్లి, భీమిలి, విశాఖ ఉత్త‌రం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇలా నియోజ‌క‌వ‌ర్గాలు, పార్టీలు మార్చినా ఒక్క‌సారి కూడా ఓడిపోయి అరుదైన నేత‌గా గంటా శ్రీనివాస‌రావు రికార్డు సృష్టించారు.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌న‌గ‌రం జిల్లా నెల్లిమ‌ర్ల నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా గంటా శ్రీనివాస‌రావు పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో ఇక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌ఫున మీసాల గీత గెలుపొందారు. ఈమె కూడా తూర్పు కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే. ఈ నేప‌థ్యంలో కాపుల కోట‌లో గంటా మ‌రోమారు విజ‌య ఢంకా మోగించ‌డం ఖాయ‌మేన‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.
Tags:    

Similar News