విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీలో మరోమారు ఇద్దరు సీనియర్ల మధ్య రచ్చ స్టార్ట్ అయింది. ఆ ఇద్దరూ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ మంత్రులుగా చేసిన వారు. ఇద్దరూ మాజీలుగా ఇపుడు ఉన్నారు. ఇద్దరూ బలమైన సామాజికవర్గానికి ఉత్తరాంధ్రాలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎత్తులు వ్యూహాలలో ఎవరికి ఎవరూ తీసిపోరు. వారే గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు.
ఈ ఇద్దరు పోరుకూ దశాబ్దాల చరిత్ర ఉంది. 2004 వరకూ ఇద్దరూ బాగానే ఉన్నారు. 2004లో అనకాపల్లి ఎంపీ నుంచి చోడవరం ఎమ్మెల్యేగా గటా పోటీ చేయడానికి గంటా డిసైడ్ అయినపుడు అప్పటికి మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు వ్యతిరేకించారు అని అంటారు. ఎందుకంటే ఎమ్మెల్యే అయితే తన మంత్రి పదవికి పోటీ వస్తారని, తనతో రాజకీయంగా కూడా ఎదురునిలుస్తారు అని ముందుచూపుతోనే అలా బ్రేక్ వేయాలని అనుకున్నారని అంటారు.
కానీ అప్పటికే చంద్రబాబుతో సాన్నిహిత్యం పెంచుకున్న గంటా ఎమ్మెల్యేగానే పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడింది. ఆ తరువాత గంటా ఇంటి పోరు పడలేకనే ప్రజారాజ్యం పార్టీలోకి జంప్ అయ్యారని అంటారు. ఆయన అక్కడ తన చిరకాల మంత్రి కోరికను తీర్చుకున్నారు. తిరిగి విభజన టైం లో ఆయన తెలుగుదేశంలోకి వచ్చారు.
అయితే అపుడు కూడా అయ్యన్నపాత్రుడు ఆయన రాకను వ్యతిరేకించారు. కానీ చంద్రబాబు చేర్చుకున్నారు. తెలుగుదేశం అధికారంలోకి రావడంతో అటు అయ్యన్నతో పాటు ఇటు గంటాను మంత్రిని చేసి బ్యాలన్స్ చేశాను అనుకున్నాను. కానీ విశాఖ జిల్లాలో మాత్రం అయిదేళ్ల పాటు ఇద్దరు నేతల మధ్య పోరు ఒక స్థాయిలో నడిచింది.
ఇక 2019 ఎన్నికల్లో గంటా గెలిచారు. అయ్యన్న ఓడారు. అయితే గెలిచిన గంటా సైలెంట్ గా ఉంటే ఓడిన అయ్యన్న తెలుగుదేసం తరఫున జనంలోకి వచ్చారు. ఈ మధ్యలో ఎన్నో రూమర్లు వచ్చాయి. గంటా వైసీపీలోకి వెళ్తారని, జనసేనలోకి వెళ్తారని, అయితే గంటా వాటిని ఖండిస్తూ వచ్చారు. చివరికి ఆయన తెలుగుదేశంలోనే కొనసాగుతాను అని చెప్పేశారు. అంతే కాదు హై కమాండ్ తో ఏ మాత్రం గ్యాప్ లేకుండా చూసుకుంటున్నారు.
మళ్ళీ గంటా విశాఖ జిల్లాలో యాక్టివ్ అవుతాను అని ప్రకటించగానే అయ్యన్నకు మండుకొచ్చింది అంటున్నారు. ఎవడీ గంటా అంటూ పెద్ద నోరు చేసుకుని ఆయన విరుచుకుపడ్డారు. లక్షల్లో ఒకడు అంటూ సెటైర్లు బాగానే వేశారు. నాలుగేళ్ల పాటు ఇంట్లో కూర్చుని ఎన్నికలు రాగానే మళ్లీ పార్టీ వైపు చూస్తున్నారు అంటూ అనాల్సినవి అన్నీ అనేశారు.
అయితే ఇక్కడ అయ్యన్నకు అర్ధం అయినా చెప్పని విషయాలు చాలా ఉన్నాయని అంటున్నారు. అవేంటి అంటే గంటా బిగ్ షాట్. ఆయన ఆర్ధికంగా అంగబలం పరంగా చూసినా తెలుగుదేశానికి కావాల్సిన వారు. అందుకే ఆయన పార్టీని విడిచి వెళ్ళినా చంద్రబాబు చేర్చుకున్నారు. ఇపుడు ఇంట్లో ఉన్నా అక్కున చేర్చుకున్నారు. తెలుగుదేశం విపక్షంలో ఉంది. ఈ పరిస్థితుల్లో తనతో పాటు మరికొందరి గెలుపునకు అన్ని విధాలుగా అండగా నిలబడే నేతలు కావాలి. అందుకే గంటాను తెలుగుదేశం అధినాయకత్వం దగ్గరకు తీస్తోంది అని అంటున్నారు.
ఒకవేళ గంటా వేరే పార్టీలోకి వెళ్ళినా ఆయన్ని తీసుకుంటారు. అది ఆయనకు ఉన్న పలుకుబడి అని ఆయన మద్దతుదారులు కూడా గట్టిగా చెబుతున్నారు. అయితే అయ్యన్న సొంత పార్టీలో ప్రత్యర్ధి మీద నోరు చేసుకోవడం కంటే అసలు ఆయన్ని ఎందుకు పార్టీలోకి తీసుకుంటున్నారు అని చంద్రబాబునే అడగగలరా. అడిగినా బాబు ఆయన మాట వింటారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
అయ్యన్నపాత్రుడితో పోలిస్తే గంటా రాజకీయ జీవితం తక్కువే కావచ్చు. కానీ ఆయన వ్యూహాలు గట్టివని, అందుకే అన్ని పార్టీల నుంచీ ఆయనకు ఆహ్వానాలు ఎపుడూ ఉంటాయని అంటున్నారు. ఏది ఏమైనా విపక్షంలో ఉన్నపుడు ప్రతీ నేతా అవసరం ఉంటుంది. అలా ఆలోచించే హై కమాండ్ గంటాను కలుపుకుని పోతోంది. కానీ సొంత పార్టీ నేతలు రచ్చ చేసుకుంటూ పోతే మాత్రం బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయని అంటున్న వారూ ఉన్నారు. సో గంటా ఇంట్లో పడుకున్నారా రొడ్డెక్కారా అని కాదు పోకిరి సినిమాలో మహేష్ బాబు అన్నట్లుగా ఎపుడు వచ్చామని కాదు బులెట్ దిగిందా లేదా అన్నదే ఇంపార్టెంట్ అంటున్నారు ఆయన ఫ్యాన్స్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.