గత కొంత కాలంగా రూ.2000 నోటు రద్దుపై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ నోటు ప్రింటింగ్ ఆపేశారని, అందుకే రూ.200 నోటును ప్రవేశపెట్టబోతున్నారని వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని పార్లమెంటులో కొందరు విపక్ష సభ్యులు లేవనెత్తారు. అయినప్పటికీ - ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆ నోటు రద్దవనుందే వాదనలకు బలం చేకూరినట్లయింది. అయితే, ఆ వాదనలకు ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ శుక్రవారం తెరదించారు.
రూ.2000 నోట్లను రద్దుపై వార్తలేమీ లేవని గంగ్వార్ తెలిపారు. అంతేకాకుండా త్వరలోనే కొత్తగా రూ.200 నోటును చలామణిలోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. ''రూ.2000 నోట్లు రద్దు చేయబోతున్నారనే దానిపై వార్తలేమీ లేవు'' అని గంగ్వార్ చెప్పారు. కొత్త రూ.2000 నోట్ల ముద్రణను తగ్గించడమేది భిన్నమైన అంశమని పేర్కొన్నారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి దీనికి సంబంధించి ధృవీకరణ రావాల్సి ఉందన్నారు. రూ.2000 నోట్లపై మరింత సమాచారం ఆర్బీఐనే ఇస్తుందని కూడా స్పష్టంచేశారు.
కొత్త రూ.2000 నోటును లీగల్ టెండర్ లాగా కొనసాగిస్తూ చలామణిని పరిమితం చేస్తుందని, కానీ రద్దు చేసే అవకాశం లేదని ఓ వైపు ఇండస్ట్రి నిపుణులు కూడా చెప్పారు. కొత్త రూ.200 నోటును ప్రవేశపెట్టి, మార్కెట్ లో నెలకొన్న చిన్న నోట్ల సమస్యకు కేంద్రం చెక్ పెట్టనుందని వారు తెలిపారు. ఈ కొత్త రూ.200 నోటుతో చిన్న నోట్ల సర్క్యూలేషన్‌ను పెంచనున్నారని సమాచారం. ప్రభుత్వ అధికారుల సమాచారం ప్రకారం ఈ నోటును ఆగస్టులో మార్కెట్‌లోకి తేనున్నట్లు తెలిసింది.