మిలియనీర్ పది లక్షల డాలర్లు. బిలియనీర్ కనీసం వెయ్యి మిలియన్ల నికర ఆస్తులు. మరి.. ట్రిలియనీర్.. వెయ్యి బిలియన్ ల విలువైన నికర ఆస్తి. తరచూ ఫోర్బ్స్ టాప్ టెన్ బిలియనీర్ల జాబితాను విడుదల చేస్తుంది. అందులో ఇప్పటివరకు ఒక్క ట్రిలియనీర్ కూడా ఉండదు. ఎందుకంటే.. ఇప్పటివరకు ట్రిలియనీర్ గా ఎవరూ ఈ భూప్రపంచంలో లేకపోవటమే. కానీ.. రానున్న రోజుల్లో ఇదేమంత కష్టం కాదంటున్నారు. అంతకంతకూ పెరిగే సంపదతో.. భూమి మీద తొలి ట్రిలియనీర్ అయ్యే రోజు దగ్గర్లోనే ఉందని చెబుతున్నారు.
మరి.. అంత సంపద ఎవరు సొంతం చేసుకుంటారు? చరిత్రలో ఎవరు తొలి ట్రిలియనీర్ గా నిలుస్తారన్నది పెద్ద ప్రశ్న. అయితే.. ట్రిలియనీర్ అయ్యే వ్యక్తి.. పక్కరోజుకు కూడా ఆయన స్థానం మారిపోవచ్చు.కారణం.. షేర్ మార్కెట్లో చోటు చేసుకునే హెచ్చుతగ్గులు ట్రిలియనీర్ కీర్తి కిరీటం ఎంతసేపు ఉంచాలన్నది డిసైడ్ చేయటమే దీనికి కారణం.
ఇంతకీ తొలి ట్రిలియనీర్ అయ్యే అవకాశం ఎవరికి ఉందన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వివిద సంస్థల లెక్కల ప్రకారం.. తొలి ట్రిలియనీర్ అయ్యే అవకాశం ఎలాన్ మస్క్ కు ఉందంటున్నారు. రెండో అవకాశం అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ కు.. మూడో అవకాశం బిల్ గేట్స్ కు ఉందంటున్నారు. ఎలాన్ మస్క్ కే ఎక్కువ అవకాశాలు ఎందుకు ఉన్నాయంటే.. అతను చేస్తున్న వ్యాపారాలే దీనికి కారణంగా చెబుతున్నారు.
స్పేస్ ట్రావెల్.. ఎలక్ట్రికల్ ఆటోమొబైల్స్ బిజినెస్ లో ఉండటం.. భూమి మీద మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ ఇచ్చే స్టార్ లింగ్ స్పేస్ ఇంటర్నెట్ వ్యాపారం కూడా అతనిదే కావటం.. రానున్న సంవత్సరాల్లో మార్స్ మీద కాలనీని ఏర్పాటు చేసే సత్తా ఉందని నమ్ముతున్న వేళ.. అతనే తొలి ట్రిలియనీర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతారు. వాతావరణ మార్పుల్ని మానవయోగ్యంగా మెరుగుపరిచే వారే భవిష్యత్తులో అత్యంత సంపన్నుడు అయ్యే అవకావం ఉంది. ఎనర్జీని పండిస్తున్న ఎలన్ మాస్క్ కు తొలి ట్రిలియనీర్ అయ్యే వీలుందని చెబుతున్నారు.
రెండో అవకాశంగా అమెజాన్ అధిపతికి కూడా అవకాశం ఉంది. దీనికి తోడు ఎలాన్ మస్క్ కు.. జెఫ్ బెజోస్ కు మధ్య వ్యాపార పోటీ మాత్రమే కాదు..సంపదలోనూ ఈ ఇరువురు మధ్య అంతరం చాలా తక్కువ. ఒకసారి ఎలాన్ ఉంటే.. మరోసారి జెఫ్ ఉండటం చూస్తున్నాం. కరోనా మహమ్మారి పుణ్యమా అని అమెజాన్ అధిపతి ఆస్తులు భారీగా పెరగటం తెలిసిందే.
1994లో అమెజాన్.కామ్ అనే పేరుతో ఆన్ లైన్ బుక్ స్టోర్ ప్రారంభించిన అతడు.. ప్రస్తుతం 192 బిలియన్ డాలర్ల ఆస్తుల్ని సొంతం చేసుకోవటం.. కరోనా వైరస్ అతడి ఆస్తులు మరింత పెంచేలా సాయం చేసింది. ఇప్పుడున్న అంచనాల ప్రకారం 2026 నాటికి బెజోస్ తొలి ట్రిలియనీర్ గా అయ్యే వీలుందని చెబుతున్నారు. ఎలాన్ కూడా ఇంచుమించు అదే సమయానికి ట్రిలియనీర్ అయ్యే వీలుంది.
నిపుణుల అంచనా ప్రకారం తొలి ట్రిలియనీర్ అవకాశం ఉన్న మూడో సంపన్నుడు బిల్ గేట్స్. కాకుంటే ఆయన రానున్న రోజుల్లో తన ఆస్తిని దానం ఇవ్వకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే అవకాశం ఉంది. 2013లో గేట్స్ ఫౌండేషన్ కోసం 28 బిలియన్ డాలర్లను దానం ఇవ్వటం లాంటివి భవిష్యత్తులో చేస్తే మాత్రం.. తొలి ట్రిలియనీర్ అయ్యే అవకాశాన్ని మిస్ చేసుకుంటాడు. భూమండలంలో అత్యంత సంపన్నుడన్న పేరు కంటే.. తాను సంపాదించిన దానిని ఏదైనా మంచి కార్యక్రమం కోసం ఖర్చుచేయాలని భావించే గేట్స్ కు.. తొలి ట్రిలియనీర్ ట్యాగ్ మీద అంత మోజు ఉండే అవకాశం ఉండకపోవచ్చు.