ఆయన టీడీపీ మాజీ ఎమ్మెల్యే. గత 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కేవలం 25 ఓట్ల తేడాతో పరాజ యం పాలయ్యారు. అయినప్పటికీ.. ఎమ్మెల్యేగానే ఆయన వర్గం భావిస్తోంది. దీంతో సదరు నాయకుడు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఆయనే బొండా ఉమా మహేశ్వరరావు. తాజాగా జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తన సత్తా చాటాలని ఆయన నిర్ణయించుకుని ఆదిశగానే అడుగులు వేశారు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని వార్డుల్లోనూ టీడీపీ తరఫున తన వర్గం వారికే ప్రాధాన్యం ఇచ్చారు. తన వర్గానికి చెందిన బలమైన నేతలకే అవకాశం ఇప్పించుకున్నారు.
అంతేకాదు.. తనే స్వయంగా వారి తరఫున ప్రచారం నిర్వహించుకున్నారు. ఇక, చంద్రబాబు విజయవాడ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా సెంట్రల్ నియోజకవర్గంలో రోడ్ షో చేసేలా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. చంద్రబాబు విజయవాడ మొత్తం పర్యవేక్షించి.. పార్టీని బలోపేతం చేయడంతోపాటు.. పార్టీని గెలుపు గుర్రం ఎక్కించాలని బొండాకు సూచించారు. కానీ, ఆయన మాత్రం కేవలం సెంట్రల్ నియోజకవర్గంపైనే దృష్టి పెట్టారు. దీనికి బలమైన కారణం.. ఉందని అంటున్నారు పరిశీలకులు.
విజయవాడలో టీడీపీ కార్పొరేషన్ లో పట్టు పెంచుకున్నా.. తప్పించుకు న్నా.. సెంట్రల్‌లో మాత్రం తన పట్టు సడలకుండా చూసుకోవాలని ఆలోచించడమేనని అంటున్నారు విశ్లేషకులు. అంటే.. తన నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తాను గెలుపు గుర్రం ఎక్కాలనేది బొండా ఉమా తాపత్రయం. అంటే.. ఇది పార్టీ పరంగానే కాకుండా .. అవసరమైతే.. వ్యక్తిగతంగా తాను పట్టు పెంచుకుంటే.. తన బొమ్మ చూసి ఓట్లు వేసేలా ఆయన వ్యూహాత్మకంగా కార్పొరేషన్ ఎన్నికలను వాడుకున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ పరిస్తితి ఎలా ఉన్నా.. తను మాత్రం తన హవాను ప్రదర్శించి విజయం దక్కించుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నే కార్పొరేషన్ ఎన్నికల్లో దూకుడుగా ముందుకు సాగారని చెబుతున్నారు. మరిఈయన దూకుడు ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.