పరుగుకు పరుగుకు ప్రయాస.. క్రీజులో నిలిచేందుకుకష్టాలు.. బంతిని ఎదుర్కొనేందుకు బాదరబందీ..పట్టుమని పది పరుగులు కాదు కదా.. కనీసంఖాతా తెరిచినా చాలనే ఆలోచన.. ఇదీ ప్రస్తుతంవిరాట్ కోహ్లి పరిస్థితి. ఈ సీజన్ ఐపీఎల్ లో 9మ్యాచ్ ల్లో అతడు చేసిన పరుగుల 128. ఇందులోరెండు గోల్డెన్ డక్ లు. కనీసం ఒక్క అర్ధ శతకమూలేదు. 41, 12, 5, 48, 1, 12, 0, 0, 9.. ఇదీఅతడు చేసిన పరుగుల లెక్క. మంగళవారంరాజస్థాన్ తో మ్యాచ్ లోనూ డకౌటయ్యే వాడే. కానీ,త్రుటిలో తప్పింది. అయినా చేసింది 9 పరుగులే.
ఏడా గెలుపు సారథి..?
విరాట్ కోహ్లి అంటే గెలుపు.. అది ఆటలో అయినా,నిజ జీవితంలో అయినా.. కానీ, ఇప్పుడా కోహ్లి
కనీసం కనిపించడం లేదు. ఆటపై కసి తగ్గిందా..?అన్నట్లుంది అతడి వాలకం చూస్తుంటే. వాస్తవానికికోహ్లి వన్ డౌన్ బ్యాట్స్ మన్. వన్డేలు, టి20లుదేనిలోనైనా అదే అతడి స్థానం. జట్టులోనిఅత్యుత్తమ బ్యాట్స్ మన్ వచ్చే స్థానం ఏదంటే వన్డౌన్. కానీ, ఇప్పుడా స్థానానికి కోహ్లి సరితూగగలడా?అనే ప్రశ్నఉత్పన్నమవుతోంది. ఎందుకంటే.. ఒకరిద్దరు మినహా మిగతా అంతాసాధారణ స్థాయి బౌలర్లుండే ఐపీఎల్ లోనే అతడుపరుగులుచేయలేకపోతున్నాడు. అలాంటిదిఅంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎలాఎదుర్కొంటాడన్నది ప్రశ్నార్థకం.
ఓపెనర్ గా వచ్చినా..
వన్ డౌన్, మిడిలార్డర్ కలిసి రావడం లేదనిభావించాడో ఏమో.. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్లో కోహ్లి మంగళవారం ఓపెనింగ్ కు వచ్చాడు.స్ట్రయికింగ్ కు దిగి.. మూడో బంతికే ఔటయ్యేప్రమాదం తప్పించుకున్నాడు. హిప్ మీదకు వచ్చినబంతి లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేయగా స్వ్కేర్ లెగ్లో గాల్లోకి లేచి.. ఫీల్డర్ కు అతికొద్ది దూరంలోపడింది. దీంతో వరుసగా మూడో డక్ ను కోహ్లితప్పించుకున్నాడు. కానీ, తర్వాత కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు.
ప్రమాదంలో టి20 కెరీర్..
కోహ్లి మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టు సభ్యుడు.కానీ, దేనిలోనూ అతడు సెంచరీ చేయకరెండున్నరేళ్లయింది. ఇందులో ఆర్నెళ్ల కాలాన్నికొవిడ్ కారణంగా మినహాయిస్తే.. రెండేళ్లయిందిఅతడు శతకం బాది. ఈ ప్రదర్శన కుర్రాళ్లకు బాగాఅనువైన టి20ల్లో కోహ్లి స్థానాన్ని ప్రశ్నార్థకంచేస్తోంది. అతడి టి20 కెరీర్ ప్రమాదంలో పడేఅవకాశం ఉంది. టీమిండియాలో స్థానం దక్కడమూకష్టమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసలే ఈ
ఏడాది టీ20 ప్రపంచకప్ పోటీలు ముందున్నాయి.ఇప్పటికే అన్ని జట్లలోని కీలక ఆటగాళ్లు ఫామ్‌నుదొరకబుచ్చుకుని చెలరేగుతున్నారు. అలానే విరాట్‌కూడా మళ్లీ పరుగులు సాధించాలని అభిమానులుకోరుకుంటున్నారు.కాగా, వైఫల్యాల రీత్యా ఐపీఎల్నుంచి విరాట్ కాస్త విరామం తీసుకుంటే మంచిదనేసలహాలు వస్తున్నాయి. టీమిండియా మాజీ కోచ్‌రవిశాస్త్రి ఇదే విషయం చెప్పాడు.
ఒకే విధంగా ఔట్..
కోహ్లి మానసికంగానే కాదు.. సాంకేతికంగానూఅలసిపోయినట్లు కనిపిస్తోంది. అతడు ఒకే రకమైనషాట్లకు పెవిలియన్ చేరుతున్నాడు. గత మూడుమ్యాచ్‌లలో బ్యాట్‌కుఎడ్జ్ తీసుకుని బంతి ఫీల్డర్‌చేతిలో పడింది. అసలు అతడు ఏ మ్యాచ్‌లోనూఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయడం లేదు.ఇప్పటికైనా నిపుణులు సూచించినట్లు కోహ్లి కాస్తవిశ్రాంతి తీసుకుని.. మైదానంలోకి దిగితే అతడుపుంజుకునే అవకాశం ఉంటుంది.