యువ ఎంపీ దూకుడుకు బీజేపీలో లొల్లిలొల్లి

Update: 2019-12-11 11:19 GMT
ఒకరేమో దూకుడుకు పర్యాయపదమైన యువ ఎంపీ.. ఇంకొకరేమో అనాది పార్టీని నమ్ముకొని ఉన్న సీనియర్ నేత. ఇప్పుడు వీరిద్దరి ఆధిపత్య పోరు నడుమ కమల నాథులు నలిగిపోతున్నారట.. నిజామాబాద్ జిల్లాలో రెండు వర్గాలుగా బీజేపీ చీలిపోయిందట..

బీజేపీ సీనియర్ నేత యెండల లక్ష్మీనారాయణ అనాదిగా బీజేపీ క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ దూకుడైన రాజకీయంతో ఆయన సొంతంగా రాజకీయం చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు ఆధిపత్యం కోసం చేస్తున్న బలప్రదర్శనతో ఎటువైపు నిలువాలో తెలియక కార్యకర్తలు అయోమయంలో పడిపోతున్నారట..

మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో నిజామాబాద్ పార్లమెంట్ పై బీజేపీ జెండా ఎగురవేయడానికి ఇద్దరు నేతలు ఎవరికి వారు కత్తులు నూరుతున్నారు. తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడానికి ఇప్పటినుంచే పోటీపడుతున్నారు. దీంతో ఎవరికి టికెట్ల కేటాయింపు అధికారం దక్కుతుందో తెలియక.. ఎవరి పంచన చేరాలో అర్థం కాక కార్యకర్తలు, కింది స్థాయి నేతలు తలలు పట్టుకుంటున్నారట..

తాజాగా బీజేపీలో ఓడిపోయిన వారి గురించి పట్టించుకోవద్దు అని ఎంపీ అరవింద్ చేసిన కామెంట్స్ తో యెండల వర్గం రగిలిపోతోందట..ఈ పంచాయితీని బీజేపీ రాష్ట్ర అధిష్టానం వద్దే తేల్చుకోవడానికి రెడీ అయ్యిందట.. సో ఇలా నిజామాబాద్ బీజేపీలో ఎంపీ వర్సెస్ సీనియర్ నేత వ్యవహారం సెగలు కక్కుతోందట..
Tags:    

Similar News