జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా రాటుదేలారు. ఆయన ఫేస్ టూ ఫేస్ పొత్తుల మీద చంద్రబాబుతో ఏమి మాట్లాడుతారో తెలియదు కానీ క్యాడర్ తో మాట్లాడినపుడు మీటింగ్స్ లో మాత్రం తన మనసులో మాటలను అలా చెప్పేస్తున్నారు. రీసెంట్ గా రణస్థలం మీటింగ్ లో పవన్ అన్న మాటలను మననం చేసుకుంటే తెలుగుదేశానికి మా చెడ్డ చిక్కే తెచ్చి పెట్టారని అనుకోవాలి.
గౌరవప్రదంగా ఉంటేనే పొత్తులు అంటూ పవన్ ఒక షరతు లాంటిది విధించారు. గౌరవం బరువు ఎంత అన్నదే ఇపుడు చర్చకు వస్తుంది. కనీసంగా యాభై సీట్లు ఇవ్వకపోతే జనసేనకు గౌరవం దక్కదని అంటున్నారు. అదే విధంగా రేపటి ఎన్నికల తరువాత రెండు పార్టీలు గెలిస్తే అధికారాన్ని పంచుకోవాలని కూడా అన్యాపదేశంగా మరో కండిషన్ ఉంది.
ఇది పవన్ నేరుగా అడుగుతున్నట్లుగా లేదు, సీఎం సీఎం అని జనసైనికుల చేత పిలిపించుకుంటూ అక్కడ నుంచే డిమాండ్ ని తెప్పిస్తున్నట్లుగా ఉంది. నిజానికి ఈసారి జనసైనికులే కాదు, బలమైన కాపు సామాజికవర్గం కూడా పవన్ని సీఎం సీట్లో కూర్చోబెట్టకపోతే ఊరుకోదు. ఆ విషయం స్పష్టం. పవన్ తో పొత్తు అని తెలుగుదేశం అడుగులు ముందుకు వేస్తున్నా అది అనుకున్నంత సులువు కానే కాదు అని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ సైతం అనుభవం ఉంది. పెద్దాయన అని చంద్రబాబు విషయంలో కొంత తగ్గాలనుకున్నా సొంత పార్టీ సహా సొంత సామాజిక వర్గంలో పరిస్థితులు అలా లేవు అని అంటున్నారు. అందువల్లనే పవన్ కళ్యాణ్ సైతం పదే పదే గౌరవం ఒంటరి పోరు లాంటివి వాడాల్సి వస్తోంది అని అంటున్నరు. ఇక చూస్తే 2014లో పెద్దాయన అనుభవం రాష్ట్రానికి కావాలని పవన్ అనేశారు. 2024లో కూడా అదే మాట వాడితే కాపుల నుంచి వ్యతిరేకత వస్తుంది అని అంటున్నారు.
దాంతో తెలుగుదేశంతో పొత్తులకు జనసేనతో పాటు కాపు సామాజికవర్గం ఓకేగా ఉన్నా కూడా ముఖ్యమంత్రి పదవిని కనీసం ఏడాది పాటు అయినా పవన్ కి ఇస్తే కాపుల చిరకాల డిమాండ్ నెరవేరుతుంది అని అంటున్నారు. అయితే చంద్రబాబు రాజకీయం చూసిన వారు గత చరిత్రను అవలోకనం చేసుకున్న వారు ఆయన సీఎం సీటు తప్ప ఏమైనా ఇస్తారని అంటున్నారు.
మరి పవన్ కి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడానికి కూడా చంద్రబాబు రెడీ అవుతారు అని అంటున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ రోజులలో విలువ ఉండేది. ఎందుకంటే హై కమాండ్ ఢిల్లీలో ఉంటుంది. ముఖ్యమంత్రి అయినా ఎవరైనా అక్కడ సమానమే. కానీ ప్రాంతీయ పార్టీలలో చూస్తే ముఖ్యమంత్రి పోస్టు చాలా పవర్ ఫుల్. ఇక ఉప ముఖ్యమంత్రి పదవి అన్నది ఆరో వేలు లాంటిది. అయినా సరే గొప్పగా చెప్పుకుందామనుకుంటే దానికి ఉన్న విలువలను కాస్తా వైసీపీ ప్రభుత్వం మరింతగా తగ్గించింది అని అంటున్నారు.
ఏకంగా అయిదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించడం ద్వారా ఎవరికీ పెద్దగా ప్రాధాన్యత లేకుండా చేసి వారిని అలాగే ఉంచేసింది. మరి ఇపుడున్న పరిస్థితులలో ఉప ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్ కి అది ఏ మాత్రం నప్పని పదవే అని అంటున్నారు. అందువల్ల తెలుగుదేశానికి జనసేనతో పొత్తు ఒక విధంగా చిక్కులనే తెస్తుంది అని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి పదవిని ఆ పార్టీకి వచ్చే సీట్లతో సంబంధం లేకుండా కనీసం ఒక్క ఏడాది అయినా ఉండేలా ఇస్తే మాత్రం తెలుగుదేశం చరిత్రలో నిలిచిపోతుంది. అంతే కాదు తెలుగుదేశానికి కాపులలో శాశ్వతమైన పరపతి కూడా ఉంటుంది. కాపుల చిరకాల డిమాండ్ ని తామే నెరవేర్చామని చెప్పుకుని ఆ పార్టీ జీవితకాలం క్లెయిం చేసుకోవడానికి వీలుంటుంది. కానీ తెలుగుదేశం వెనక ఒక బలమైన సామాజిక వర్గం ఉంది. వారికి తాము తప్ప వేరొకరు సీఎం సీటు ఎక్కడం అంటే అభ్యంతరాలు ఉంటాయని అంటున్నారు.
ఈ పరిణామాల నేపధ్యం నుంచి చూసినపుడు అటు పవన్ని ఇటు బలమైన సామాజిక వర్గాన్ని హ్యాండిల్ చేయడం తెలుగుదేశానికి కత్తి మీద సాము అని అంటున్నారు. అయితే రాజకీయ ఉద్ధండ పిండం చంద్రబాబుకు ఇవన్నీ పెద్ద సమస్యలు కాదని అన్న వారూ ఉన్నారు. ఆయన ముందున్న అతి పెద్ద సవాల్ జగన్ని గద్దె దించడం. ఆ టార్గెట్ సాధించిన తరువాత చంద్రబాబు పవన్ విషయం కానీ కాపుల డిమాండ్ కానీ రాజకీయంగా తనదైన శైలిలో పరిష్కరిస్తారు అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.