2023లో జ‌గ‌న్ యాక్ష‌న్ ప్లాన్ ఈ రేంజ్‌లో ఉండ‌బోతోందా...!

Update: 2022-10-24 08:11 GMT
వ‌చ్చే ఏడాది అత్యంత కీల‌కం. మ‌రో ఏడాదిన్న‌ర‌లోనే ఏపీ సార్వ‌త్రిక స‌మ‌రం ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వానికి కానీ.. వైసీపీ నాయ‌కుల‌కు కానీ.. మిగిలింది.. కేవ‌లం ఏడాది స‌మ‌యం మాత్ర‌మే. ఈ ఏడాది కాలంలోనేవారు ఏం చేయాల‌న్నా.. చేసేది.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేది. చివ‌రి ఆరు మాసాలు మాత్రం.. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు అస‌లు స‌మ‌యం ఉండ‌దు. పైగా.. ఎన్నిక‌ల వ్యూహాలు.. టికెట్ల హ‌డావు డి.. నోటిఫికేష‌న్ వంటివాటితోనే స‌మ‌యం స‌రిపోతుంది. ఇది స‌హ‌జంగానే జ‌రిగే ప్ర‌క్రియే.

ఈ నేప‌థ్యంలో చివ‌రి ఆరు మాసాలు మిన‌హా మిగిలిన కాలాన్ని.. స‌ద్వినియోగం చేసుకోవాల‌ని.. వైసీపీ ప్ర‌భుత్వం, నాయ‌కులు కూడా.. భావిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ అయ్యేందుకు.. అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాల ఎత్తుగ‌డ‌ల‌ను కూడా ఎదుర్కొనేందుకు ఈ స‌మ‌యాన్ని మించిన కాలం దొర‌క‌ద ని..అంటున్నారు. ఈ క్ర‌మంలోనే.. ఇప్పుడు వ్యూహ ప్ర‌తివ్యూహాలు వేసేందుకు వైసీపీనాయ‌కులు.. రెడీ అవుతున్నారు. ప్ర‌స్తుతం.. రెండు ప్ర‌ధాన పార్టీలు.. టీడీపీ-జ‌న‌సేన‌లు పుంజుకుంటున్నాయి. క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకుంటున్నాయి.

ఈ క్ర‌మంలో ఆ రెండు పార్టీల‌కు ధీటుగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేలా ప్లాన్ చేస్తున్నారు. రెండు పార్టీల‌లోనూ ఉన్న వీక్ నెస్‌ల‌ను త‌మ‌కు అనుకూలం గా మార్చుకోవ‌డంతోపాటు.. అసంతృప్త నేత‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు వైసీపీ వ్యూహాలు రెడీ చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. రెండు పార్టీలు చేతులు క‌ల‌ప‌డం..

ద్వారా.. దాదాపు 40 స్థానాల్లో జ‌న‌సేన పోటీ చేసే అవ‌కాశం ఉంటుంది. అంటే.. ఆ 40 స్థానాల్లో టీడీపీ టికెట్లు ఆశించిన వారుభంగ ప‌డ‌తారు. ఇది అసంతృప్తికి దారితీస్తుంది. దీనిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని.. వారిని త‌మ‌వైపు తిప్పుకొనేలా.. వైసీపీ ప్లాన‌ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌ధానంగా గెలిచేస్థానాలు ఎన్ని.. ఓడే ప‌రిస్థితి ఏయే స్థానాల్లో ఉంది? అనే విష‌యాల‌పై ప్ర‌ధానంగా వైసీపీ దృష్టి పెడుతోంది. వాటిని ఎలాగైనా గెలుచుకునేందుకు నాయ‌కులు ముందుకు సాగాల‌ని.. ఇప్ప‌టికే దిశానిర్దేశం చేసింది. అదేస‌మయంలో ప్ర‌జ‌ల‌కు మ‌రిన్ని సేవ‌లు అందించేందుకు ఉన్న మార్గాల‌ను  కూడా అన్వేషిస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టిప‌రిస్థితిలోనూ గెలుపుగుర్రం ఎక్క‌డ‌మే ధ్యేయంగా.. అంద‌రూ ప‌నిచేయాల‌ని ఇప్ప‌టికే నిర్దేశించిన‌.. సీఎం జ‌గన్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌క్కాగా గెలిచే నాయ‌కులు.. అవ‌స‌ర‌మైతే.. పొరుగు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప్ర‌చారం చేయాల‌ని.. ఫైర్ బ్రాండ్ల‌ను త‌యారు చేయాల‌ని కూడా.. దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News