తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి మరో వారసురాలు ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే ? అవుననే సమాధానం వినిపిస్తుంది. ఆమె మరెవరు కాదు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత , ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి. ఈమె క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నట్టు సమాచారం. గాంధీభవన్ లో గురువారం మీడియా సమావేశంలో తండ్రితోపాటు ఆమె పాల్గొనడం దీన్నే సూచిస్తోంది.
నిజానికి జయారెడ్డి గత అసెంబ్లీ, మునిసిపల్ ఎన్నికల్లో క్రియాశీలకంగా పని చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగ్గారెడ్డి అరెస్టు కాగా, జయారెడ్డే స్వయంగా ప్రచారంలో పాల్గొని ఆకట్టుకునే ప్రసంగాలు చేశారు. అలాగే తండ్రి తగ్గ తనయగా నియోజకవర్గం లో అందరిని ఆకట్టుకున్నారు. అలాగే , మునిసిపల్ ఎన్నికల సమయంలో సదాశివరావుపేట ఇన్‌చార్జిగా వ్యవహరించి తండ్రి తరఫున కొన్ని హామీలూ ఇచ్చారు. ఈ క్రమంలోనే మరింత క్రియాశీలకంగా వ్యవహరించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.. జయారెడ్డి పట్ల సానుకూలంగా ఉన్న పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఎన్ ఎస్ యూఐ రాష్ట్ర కార్యవర్గంలో ఆమెకు చోటు కల్పించినట్లు సమాచారం.