ఈసారి కౌటిల్యుడి ట్వీట్ ను వాడేసిన లక్ష్మీనారాయణ

Update: 2022-11-07 05:30 GMT
అత్యున్నత స్థానాల్లో ఉంటూ.. కీలక బాధ్యతల్ని నిర్వహిస్తూ నిజాయితీ అన్న పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకోవటం అంత తేలికైన విషయం కాదు. అలాంటి అరుదైన పేరును సొంతం చేసుకున్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. సివిల్ సర్వీస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. సోషల్ మీడియాలో కాస్తంత చురుగ్గా ఉంటారు. అప్పుడప్పుడు తన ట్వీట్ లతో తనవైపు చూసేలా.. తన గురించి మాట్లాడుకునేలా చేసే లక్ష్మీనారాయణ తాజాగా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

కౌటిల్యుడి కోట్ ను తన తాజా ట్వీట్ గా మార్చిన లక్ష్మీనారాయణ లక్ష్యం ఏమిటి? అన్నది ఆసక్తికరంగా మారింది. చూస్తుంటే.. ఆయన పోస్టు చేసిన కౌటిల్యుడి మాటలు.. సమకాలీన రాజకీయాలను ఉద్దేశించి పెట్టినట్లుగా కనిపిస్తోంది. తన వైఫల్యాల్ని మరుగున పడేసేందుకు పాలకులు ఎలా వ్యవహరిస్తారన్న విషయాన్ని కౌటిల్యుడు చెప్పగా.. దాన్ని ప్రస్తావించిన వైనం అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకూ కౌటిల్యుడి కోట్ ను చూస్తే..

''రాజుకు తన పాలనపైన ప్రజల్లో అసంతృప్తి కలుగుతున్న భావన కలిగినపుడు , తన వందిమాగధుల ప్రచార ఆర్భాటాలు విఫలమైనపుడు, చేసేవి

1)  ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టడం

2) విదేశీ దండయాత్ర జరుగుతుందన్న ప్రచారం చేయడం

3) రాజుకు ప్రాణహాని వుందన్న ప్రచారం చేయడం'' లాంటివి చేస్తారంటూ కౌటిల్యుడు అప్పట్లో చెప్పిన మాటల్ని ఇప్పుడు ప్రస్తావించటం చూస్తే.. ఇప్పుడు జరుగుతున్న రాజకీయానికి నిలువెత్తు అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ ఉందని చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాల్ని చూసిన వారికి.. ఈ ట్వీట్ మర్మం ఇట్టే అర్థమవుతుందన్న మాట వినిపిస్తోంది. రానున్న రోజుల్లో తన ట్వీట్లతో చర్చను షురూ చేస్తారని చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News