వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అలాగే ఉండుంటే.. ఈ దఫా ఆయనకు మంచి మంత్రి పదవి దక్కేది. అప్పుడే శాసనసభా పక్ష ఉపనేతగా ఆయనకు అవకాశం ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి. అయినా వద్దనుకుని తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు జ్యోతుల. అయితే ఈయనకు అక్కడ కిరీటాలు ఏమీ పెట్టలేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేగా, అధికార పార్టీలో చలామణి అయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. ఇప్పుడు జ్యోతులది మళ్లి దిక్కుతోచని స్థితే అయినట్టుగా సమాచారం.
అందుకే ఆయన అప్పుడే మళ్లీ పార్టీ మారడానికి రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరే ప్రయత్నంలో ఉన్నారట. ఈ మేరకు సంప్రదింపులు సాగుతూ ఉన్నాయని సమాచారం. తెలుగుదేశం పార్టీ తరఫున నెగ్గలేకపోయిన జ్యోతుల ఇప్పుడు మళ్లీ వైసీపీలోకి చేరాలని భావిస్తున్నారట.
కొన్నాళ్ల కిందట ఈ వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు ఆయన గట్టిగా ఖండించలేదు. అలాగని ఆ ప్రయత్నాలు అప్పుడు సఫలం అయినట్టుగా లేవు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన వారిలో కొందరు ఎన్నికలకు ముందే తిరిగి వచ్చారు. అలా ఎన్నికలకు ముందే జ్యోతుల రాలేదు. ఇప్పుడు ఆ పార్టీ అధికారం సంపాదించుకోవడంతో అలాంటి వారు ఒక్కొక్కరుగా ఆ పార్టీలోకి చేరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జ్యోతుల కూడా చేరతారేమో. అయితే చేర్చుకోవచ్చునేమో కానీ.. ఆయనకు ప్రాధాన్యత మాత్రం పెద్దగా దక్కకపోవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.