రాహుల్ పర్యటనకు కేజ్రీవాల్ పోటీయా ?

Update: 2022-08-18 07:30 GMT
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర కు పోటీగా ఆమ్మ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోటీ యాత్ర చేయబోతున్నారా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్ తొందరలోనే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. సుమారు 140 రోజులు జరిగే పాదయాత్రలో రాహుల్ దాదాపు 3 వేల కిలోమీటర్లు కవర్ చేయబోతున్నారు.

ఇదే పద్దతిలో కేజ్రీవాల్ కూడా భారత్ పర్యటనకు రెడీ అవుతున్నారు. ఈయన కూడా ఆప్ బలోపేతానికి, దేశరక్షణకు అని చెప్పి దేశంలో యాత్రలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా కేజ్రీవాలే ప్రకటించారు.

భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలపాలన్నదే తన లక్ష్యమని చెప్పుకున్నారు. అభివృద్ధిని చెందిన దేశంగా భారత్ ను మార్చాలంటే ఇప్పటివరకు పాలించిన దేశాలన్నింటినీ పక్కన పెట్టేయాలని దేశప్రజలకు కేజ్రీవాల్ పిలుపిచ్చారు.

తన ఆలోచనలకు, లక్ష్యాలకు మద్దతు కోసం దేశవ్యాప్తంగా యాత్రను చేపట్టబోతున్నట్లు చెప్పారు. కాకపోతే ఆ యాత్ర పాదయాత్ర లేకపోతే ఇంకేవిదమైన యాత్రనేది కేజ్రీవాల్ స్పష్టం చేయలేదు. తన యాత్రను విజయవంతం చేయటానికి దేశ ప్రజలు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. మామూలు జనాలతో పాటు బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీలన్నీ కలసి రావాలని కూడా కేజ్రీవాల్ కోరారు. తాను చేపట్టబోతున్నది జాతీయ ఉద్యమం కాబట్టి దేశ ప్రజలందరు తనతో చేతులు కలపాలన్నారు.

మొత్తానికి రాహుల్ యాత్ర చేయబోతుంటే కేజ్రీవాల్ పోటీ యాత్ర చేయబోతున్నారని అర్ధమవుతోంది. రాహుల్ పాదయాత్ర ఎప్పటినుండో పార్టీలోను, జనాల్లోను నానుతోంది. రాహుల్ చేయబోయే యాత్ర అచ్చంగా పార్టీని బలోపేతం చేయటం కోసమే.

అయితే కేజ్రీవాల్ చేయాలని అనుకుంటున్న యాత్ర దేశాభివృద్ధి కోసమని చెప్పుకుంటున్నారు. మెల్లిగా ఆప్ ను దేశవ్యాప్తంగా విస్తరించాలని అనుకుంటున్న కేజ్రీవాల్ ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు అసలైన ప్రత్యామ్నయం ఆప్ మాత్రమే అని జనాలకు చెబుతున్నారు. మరి జనాలు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాల్సిందే.
Tags:    

Similar News