ఏపీ ముఖ్యమంత్రి - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ పోటీ కోసం సేఫెస్ట్ నియోజకవర్గం అన్వేషణ కొనసాగుతూ ఉంది! కొన్ని నెలలుగా చంద్రబాబు నాయుడు ఈ పనిలో ఉన్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. వివిధ నియోజకవర్గాల్లో సర్వేలు చేయించి.. లోకేష్ ను పోటీ చేయించడం గురించి బాబు ఆలోచనలు చేస్తూ ఉన్నారట. అయితే ఈ వ్యవహారం ఎంతకూ తేలకపోవడం గమనార్హం.
మరో నాలుగు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది! ఇలాంటి నేపథ్యంలో.. కూడా లోకేష్ పోటీ ఎక్కడ? అనే విషయంపై స్పష్టత లేదు. మీడియాకు మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి ఈ విషయంలో రకరకాల సమాచారాలు అందుతూ ఉన్నాయి. నాలుగైదు రోజుల నుంచి మూడు నియోజకవర్గాల విషయంలో గట్టి ప్రచారం జరిగింది.
ముందుగా భీమిలి నుంచి పోటీ అన్నారు, అక్కడ తెలుగుదేశం చాలా అభివృద్ధి చేసిందని, అందుకే లోకేష్ ను అక్కడ పోటీ చేయించడానికి బాబు రెడీగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చర్చను విశాఖ నార్త్ మీదకు మళ్లించారు. అయితే విశాఖ నార్త్ లో తెలుగుదేశం ఉనికే లేదు! ఈ విషయాన్ని గత ఎన్నికల ఫలితాలు చెబుతూ ఉన్నాయి. అందుకే విశాఖ నార్త్ విషయంలో కూడా డ్రాప్ అయ్యారట!
ఆ తర్వాత విశాఖ సౌత్ అనే ప్రచారం కూడా కాసేపు సాగింది. ఏమనుకున్నారో ఏమో కానీ ఇప్పుడు మంగళగిరి నుంచి లోకేష్ ను పోటీ చేయించనున్నారట. ఇది కూడా అధికారిక ప్రకటన ఏమీ కాదు. జస్ట్ ప్రచారం మాత్రమే!
భీమిలీ, విశాఖ నార్త్ విషయంలో ఎలా ప్రచారం జరిగిందో.. ఇప్పుడు మంగళగిరి విషయంలో కూడా అలాగే ప్రచారం సాగుతూ ఉంది. అధికారిక ప్రకటన వచ్చే వరకూ, లోకేష్ నామినేషన్ వేసేంత వరకూ.. ఈ విషయంలో ఏం చెప్పినా..అది నమ్మశక్యంగా కనిపించడం లేదు! అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.