ఆ ఇద్ద‌రి విష‌యంలో 'మాణిక్' మంత్రం ఫ‌లించిన‌ట్టేనా?

Update: 2023-01-21 03:30 GMT
నిన్న మొన్న‌టి వ‌ర‌కు దూరంగా ఉన్న టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, న‌ల్ల‌గొండ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక ట‌రెడ్డి తాజాగా భేటీ కావ‌డం కాంగ్రెస్ వ‌ర్గాల్లోనే కాకుండా రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌కు దారితీసింది. నిజానికి మునుగోడు ఉప ఎన్నిక‌ల స‌మయంలో జ‌రిగిన రాజ‌కీయం ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య గ్యాప్ పెంచింది. అదే స‌మ‌యంలో పీసీసీ చీఫ్ ప‌ద‌విని వేరే పార్టీ నుంచి వ‌చ్చిన వారికి ఎలా ఇస్తార‌ని కూడా.. వెంక‌ట‌రెడ్డి నిల‌దీశారు.

ఇక‌, మునుగోడులో త‌న త‌మ్ముడు రాజ‌గోపాల్‌కు మ‌ద్ద‌తిస్తున్న‌ట్టు వ్యాఖ్యానించి సంచ‌ల‌నం సృష్టించారు. ఇక‌, ప్ర‌చారానికి కూడా దూరంగా ఉన్నారు. అదేస‌మ‌యంలో ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌ను పెట్టుకోవ‌డం కూడా.. అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది.

ఈ ప‌రిణామాల‌తో అస‌లు ఆయ‌న‌ను కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు పంపేస్తార‌ని అంద‌రూ భావించారు. అయితే.. ఇంత‌లోనే పార్టీ అధిష్టానం ఒక్క ఛాన్స్ ఇచ్చింది.

దీనికితోడు మునుగోడులో బీజేపీ ఓట‌మి.. కూడా కోమ‌టిరెడ్డిని లైన్‌లోకి తీసుకువ‌చ్చింది. అదే అక్క‌డ బీజేపీ గెలిచిఉంటే.. వెంక‌ట‌రెడ్డి రాజ‌కీయం వేరేగా ఉండేద‌ని అంటారు.

ఇక‌, మ‌రోవైపు..పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మార‌డం కూడా .. వెంక‌ట‌రెడ్డిని కీల‌క‌మ‌లుపు తిప్పింది. మాణిక్యం ఠాకూర్ స్థానంలో మాణిక్ ఠాక్రే రావ‌డం.. వెంక‌ట‌రెడ్డితో ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం వంటివి ఫ‌లించాయి.

ఈ క్ర‌మంలోనే తాజాగా రేవంత్‌రెడ్డి, వెంక‌ట్‌రెడ్డి భేటీ కావ‌డం గ‌మ‌నార్హం. ఇక, ఈ ప‌రిణామం పార్టీలో ఒక హైప్ తెస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రోవైపు..  తనకున్న అనుభవంతో  సలహాలు, సూచనలు అందిస్తానని వెంక‌ట‌రెడ్డి చెప్ప‌డాన్ని బ‌ట్టి.. రేవంత్ వ‌ర్సెస్ వెంక‌ట్ ల మ‌ధ్య వివాదాల‌కు ఫుల్ స్టాప్ ప‌డిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  మొత్తానికి ఈ ప‌రిణామం.. రాబోయే రోజుల్లో బ‌ల‌ప‌డితే.. కాంగ్రెస్‌కు తిరుగు ఉండ‌ద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News