మోడీ కల నిజమయ్యేంత సీనుందా ఇక్కడ?

Update: 2022-07-04 06:24 GMT
తెలంగాణ‌లో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు తీసుకుని రావాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పెద్ద క‌ల‌నే కంటున్నాడు.  అంటే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ పాగా వేయ‌డం ఖాయ‌మ‌న్న‌ది ఆయ‌న ఆశ.   అయితే బీజేపీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అది చాలా పెద్ద సమస్య. అంత ఈజీ కానే కాదు. ముందుగా బీజేపీకి స్టార్ క్యాంపైన‌ర్ల‌ను వెతుక్కోవాలి. తెలంగాణ ఆత్మ తెలిసిన నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకోవాలి. ఇంటి పార్టీ  ఉప‌యోగించిన వ్యూహాలే బీజేపీ కూడా ఫాలో కావాలి.

పైగా సామాన్యుడికి పన్నులు మీద పన్నులు బాదుతున్న మోడీ మతాన్ని అడ్డుపెట్టుకుని ఉత్తరాదిలో నెగ్గుకువస్తున్నాడు గాని తెలుగు ప్రజలు మంటగా ఉన్నారు. అందుకే బీజేపీ ఇప్పట్లో ఇక్కడ నెగ్గుకు రావడం చిన్న విషయం కాదు అని విశ్లేష‌కులు అంటున్నారు.

తిమ్మిని బమ్మిని చేయగలిగిన నాయకులు కూడా బీజేపీకి ఇక్కడ లేరు. మోడీ అనుకున్న లేదా ఊహించుకుంటున్న డ‌బుల్ ఇంజన్ స‌ర్కారు ఏర్పాటు లేదా వాటి వ్యూహాలు విజయానికి దూరంగా ఉన్నాయి.

విజ‌యం సాధించేదాకా విశ్ర‌మించ‌వ‌ద్ద‌ని బీజేపీ అధినాయ‌క‌త్వం చెబుతోంది. కానీ తెలంగాణ బీజేపీలో అలుపెరుగ‌క శ్ర‌మించే నాయ‌కులు ఎంత‌మంది ఉన్నారు అని ? ఒక్క‌సారి ఆలోచించుకుంటే వాస్త‌వాలు అన్న‌వి అర్థం అవుతాయి. వాస్త‌వ స్థితిగ‌తులు అన్న‌వి అంచ‌నాకు తూగుతాయి. అ వేవీ కాకుండా మాట్లాడితే గాల్లో మేడ‌లు క‌ట్టిన చందంగానే ఉంటుంది.

ముఖ్యంగా తెలంగాణ బీజేపీని న‌డిపిస్తున్న బండి సంజ‌య్ స్థానంలో మ‌రొక‌రిని  నియ‌మిస్తే బాగుంటుంద‌న్న వాద‌న కూడా ఉంది. అదేవిధంగా ఈట‌ల లాంటి సీనియ‌ర్ల‌ను బీజేపీ అధినాయ‌క‌త్వం స‌రిగా వాడుకోవ‌డం లేద‌న్న వాద‌న కూడా ఉంది. తెలంగాణ‌లో  మోడీ అనుకున్నంత సులువుగా బీజేపీ అధికారంలోకి రావ‌డం అన్న‌ది చాలా అంటే చాలా కష్టం అనే తెలుస్తోంది. స‌ర్వేలు కూడా ఇవే చెబుతున్నాయి.

బండి సంజ‌య్ కాకుండా ఇంకెవ్వ‌రైనా ఆ స్థానంలోకి వ‌స్తే పార్టీ బాగుప‌డుతుంది అన్న మాట కూడా విన‌వ‌స్తోంది. ఇక అర‌వింద్ లాంటి ఎంపీల కార‌ణంగా పార్టీ ఒడ్డెక్క్ద‌డం సాధ్యం కాని ప‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఈ ద‌శ‌లో మోడీ అనుకున్న విధంగా ఫ‌లితాలు రావ‌డం సులువు కాదు. బ‌లమైన ఉప ప్రాంతీయ పార్టీల ద‌గ్గ‌ర బీజేపీ నెగ్గుకు రా వడం సులువు కాని ప‌ని. క‌నుక అటు ఏపీ కానీ ఇటు టీజీ కానీ బీజేపీకి అంత అనుకూలం కానీ ఊళ్లు మ‌రియు ప్రాంతాలే !
Tags:    

Similar News