ప్రధాని నరేంద్ర మోడీ తరచుగా.. కాంగ్రెస్ ఒకప్పటి నాయకుడు, ఆ పార్టీ అధ్యక్షుడు కూడా అయిన దివం గత జవహర్ లాల్ నెహ్రూపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటారు. ఆయనకు ఒక విధానం లేదని, ఆయన వల్లే దేశం విభజన జరిగిందని, కేవలం రాజకీయాల కోసమే ఆయన అనేక తప్పులు చేశారంటూ ఇటీవల కూడా మోడీ విమర్శలు గుప్పించారు.
నిజమే కావొచ్చు.. నెహ్రూ తప్పులు చేశారని .. మోడీ చెప్పిన మాటలను బట్టి నమ్మేద్దాం. చరిత్ర, పుస్తకా లను పక్కన పెట్టేసి.. మోడీ విశ్వసనీయతకు జెండాలెత్తుదాం. అయితే, ఒక వేలు ఇతరుల వైపు చూపిస్తే.. నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తాయని అన్నట్టుగా.. నెహ్రూ వైపు ఒకవేలు చూపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ వైపు ఇప్పుడు నాలుగు వేళ్లు చూపిస్తున్నాయి.
తాజాగా సోమవారం ఉదయం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో అహ్మదాబాద్ జిల్లాలోని సబర్మతి నగర్‌లో ఉన్న ఒక పాఠశాలలో ప్రధాని మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనిని ఎవరూ తప్పుబట్టరు. కానీ, గత పాలకులు అనుసరించిన విధానంతో పోల్చుకుంటే.. మోడీ విధానం ఏమేరకు మెరుగు? అనేది చర్చకు వస్తోంది.
గత పాలకులైన నెహ్రూ రాజకీయాలు చేశారని, అన్నింటినీ రాజకీయ కోణంలోనే చూశారని చెప్పే మోడీ.. ఇప్పుడు చేసిందిఏంటి? అనేది చర్చకు వస్తోంది. ఎందుకంటే.. బలమైన.. ప్రజలను ప్రభావితం చేయగల నాయకుడు.. ఎన్నికల సమయంలో ఇలా ప్రత్యక్షంగా వెళ్లి ఓటు వేయడం ద్వారా ప్రజలను ప్రభావితం చేయడం కాదా?.. వారితో ముచ్చటించడం, ఓటర్లను పలకరించడం ఎన్నికలను ప్రభావితం చేయదా? అనేది ప్రశ్న.
సరే.. మోడీ విషయం ఇలా ఉంటే.. అప్పట్లో నెహ్రూ ఏం చేశారు? అనేది చూస్తే.. మోడీకి నోట మాట రాదు. నెహ్రూ స్వయంగా ఎన్నికల్లో పోటీ చేసిన నియోజకవర్గం యూపీలోని 'ఫూల్ పూర్'. ఇక్కడ నుంచి ఆయన అనేక మార్లు విజయం దక్కించుకున్నారు. అయితే.. తొలి సారి తప్ప మరి సార్లు ఎప్పుడూ కూడా ఆయన ప్రత్యక్షంగా ఇక్కడకు వచ్చి ఓటేయలేదు.
దీనికి కారణం.. తాను స్వయంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి.. ఓటు వేస్తే.. దాని ప్రభావం పూర్తి ఎన్నికలపై పడుతుంది. ఓటర్లు ప్రభావితం అవుతారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇబ్బందికర పరిణామం. మనకు బ్యాలెట్ బాక్స్ విధానం అందుబాటులోకి వచ్చింది(అప్పట్లో కొత్తగా వచ్చింది). దీనిని వినియోగించుకుని ఓటేస్తే.. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదీ.. నెహ్రూ స్వయంగా మీడియాకు చెప్పి, చేసింది కూడా. మరి మోడీ అనేక రూపాల్లో నెహ్రూపై విరుచుకుపడతారే.. మరి ఎన్నికలు వచ్చేసరికి ఈ స్ఫూర్తి ఏమైనట్టు? అనేది ప్రజాస్వామ్య వాదు లప్రశ్న.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.