ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి గత 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం సాధించిన మాగుంట శ్రీనివాసుల రెడ్డికి రాజకీయంగా సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇప్పటి వరకు ఆయన ఆరు సార్లు పోటీ చేస్తే.. కేవలం రెండు సార్లు మాత్రమే ఆయన పరాజయం పాలై.. మిగిలిన నాలుగు సార్లు విజయం సాధించారు. అయితే.. ఈ నాలుగు సార్లు కూడా మాగుంట.. టీడీపీ నుంచి బరిలో దిగిన బలహీన నాయకులపైనే విజయం సాధించారనే టాక్ ఉంది. ఇదే సమయంలో వైసీపీ నుంచి 2014లో పోటీ చేసిన వైవీ సుబ్బారెడ్డి, అంతకు ముందు టీడీపీ నుంచి పోటీ చేసిన కరణం బలరామకృష్ణమూర్తి వంటి బలమైన నేతల చేతిలో మాత్రం మాగుంట పరాజయం పాలయ్యారు.
మరి దీనికి కారణం ఏంటి? అంటే.. మాగుంటకు రాజకీయంగా సొంత బలం ఉండదనే వాదన ఉంది. కేవలం ఎన్నికలకు ముందు పార్టీ ఫండ్ మీద డిపెండ్ అవుతారనే వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. అంతేకాదు.. తనను గెలిపించిన వారి పట్ల కూడా ఆయన బాధ్యత తీసుకునే టైప్ కాదనే టాక్ ఉండడం గమనార్హం. ఇక, తనకు టీడీపీ, వైసీపీ రెండూ సమానమేనని.. మా ఇంటికి వస్తే.. కాఫీలు తాగారా? టిఫీనీలు చేశారా? అనే టైపని కూడా మాగుంట విషయంలో ఇక్కడ చర్చించుకుంటుండడం గమనార్హం. అంతకు ముంచి ఆయన స్థానిక ప్రజల సమస్యలు పట్టించుకోవడం, వారి సమస్యలపై అధికారులతో మాట్లాడి బాధ్యత తీసుకుని పరిష్కరించడం అనేవి కనిపించవని అంటారు.
అంతేకాదు.. తన నియోజకవర్గంపైనా మాగుంటకు పట్టు లేదని అంటారు ఆయన గురించి తెలిసిన వారు. పశ్చిమ ప్రకాశం జిల్లా లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. ఇంత వరకు మండలాల కన్వీనర్లు ఎవరో కూడా మాగుంటకు తెలియక పోవడం గమనార్హం. ఇదొక ఎత్తయితే.. ప్రొటోకాల్ ప్రకారం ఎంపీ కాబట్టి అన్ని కార్యక్రమాలకు ఆయనను ఆహ్వానించాలి. అయితే.. మాగుంట విషయంలో మాత్రం ఎవరూ ఆయనను పట్టించుకోవడం లేదు. ఇదేదో ఎవరో చెప్పడం లేదు. మాగుంట కార్యాలయం వద్ద ఆయన మనుషులే.. `మా సార్‌ను ఎమ్మెల్యేలు ఎవరూ పిలవడం లేదు. మా పరిస్థితి దారుణంగా ఉంది`` అంటున్నారు. అంతేకాదు, ఒంగోలు వచ్చినప్పుడు ఎస్ ఎం ఎస్ రూపంలో ఒక మెసేజ్ పంపిస్తారు.. తప్పితే.. ఇంత వరకు ఒక్క పనికూడా చేయలేదని ఆయనపై కార్యకర్తలే గుర్రుగా ఉండడం గమనార్హం.
ఇదే విషయం ఇప్పుడు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. కొందరు ఏకంగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ``ఈసారి ఓట్లు అడగడానికి వస్తే.. మాసత్తా చూపిస్తాం`` అని ఓటర్లు కూడా అనేస్తున్నారు. అంటే.. నాలుగు సార్లు గెలిచినా.. ప్రజల్లో ఆయన బలం సంపాయించుకోలేక పోయారనే వాదన ఉంది. ఏదో కేవలం పార్లమెంటులో ఒక ప్రశ్న అడిగేసి.. దానిని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని పబ్బం గడుపుకోవడమే తప్ప.. ప్రజలకు ఇతమిత్థంగా ఆయన చేసింది ఏమీ కనిపించడం లేదు. దీనిని బట్టి.. ఆయనకు ప్రజల్లో బలం లేకపోగా.. ఇప్పుడు కనీసం ఎంపీ అనే గౌరవం కూడా లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. ఇక, పార్టీ పరంగా చూసుకున్నా.. మాగుంటకు మైనస్‌లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన పార్లమెంటు పరిధిలోని ఒంగోలు కార్పొరేషన్, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మునిసిపాలిటీలలో మాగుంట మనుషులు ఒక్కరికి కూడా ఛాన్స్ దక్కలేదు. ఇదంతా వైసీపీ వ్యూహాత్మకంగానే చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఇదంతా.. మాగుంట వైఖరి వల్లేనని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ పరిస్థితిని ఆయన గ్రహించి మార్చుకుంటారో.. లేదా.. ఎస్ ఎం ఎస్‌లకే పరిమితం అవుతారో.. చూద్దాం అంటున్నారు పరిశీలకులు.