ముద్రగడ పార్టీనా? ఫ్లెక్సీల హోరు

Update: 2021-01-03 10:29 GMT
ఏపీ రాజకీయాల్లో కాపుల ప్రభావం అంతా ఇంతాకాదు.. ప్రతి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు వారిని వాడుకొని అధికారంలోకి వస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. అయితే స్వతహాగా కాపు నేతలు కూడా పార్టీలు పెట్టాలని చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే జనసేన పవన్ ను కాపు నాయకుడిగానే ఆ వర్గం వారు భావిస్తారు. ఇక తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజును కాపులు ఓన్ చేసుకుంటున్నారు.

అయితే వీరికంటే ముందే ఏపీలో కాపు ఉద్యమాన్ని రగిల్చారు ముద్రగడ పద్మనాభం. కాపు ఉద్యమ నాయకుడైన ముద్రగడ సైతం త్వరలో రాజకీయ పార్టీ పెడుతున్నారంటూ తాజాగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి.

ఈ ఫ్లెక్సీలపై తాజాగా ముద్రగడ సీరియస్ అయ్యారు. తన గౌరవానికి భంగం కలిగించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని.. విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని శనివారం కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అయితే కాకినాడకు సంబంధించిన విషయం కాబట్టి అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు తాజాగా ముద్రగడకు చెప్పినట్టు తెలిసింది.
Tags:    

Similar News