ప్రస్తుతం ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కీలక దశకు చేరుకుంటోంది. ఇప్పటికే యుద్ధం ప్రారంభమై 8 నెలలు గడిచిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరిపై ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధభేరి మోగించిన సంగతి తెలిసిందే.
మొదట్లో ఉక్రెయన్‌పై సులువుగా గెలిచేలా కనిపించిన రష్యా ఆ తర్వాత తీవ్ర దెబ్బలు తింది. భారీ ఎత్తున సైనికులను కోల్పోయింది. మరోవైపు తాము కోల్పోయిన ప్రాంతాలను ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంటూ వస్తోంది.
ఉక్రెయిన్‌కు అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు ఆయుధ సాయం చేస్తుండటంతో రష్యా కూడా తమకు ఆయుధాలు అందించే దేశాలపై దృష్టి పెట్టింది. కొన్ని ప్రాంతాల్లో రష్యా సైన్యానికి మందుగుండు సామగ్రి అందుబాటులో లేదనే వార్తలు వస్తున్నాయి. అలాంటి వారిని ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది.
దీంతో రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు సరఫరా చేస్తోంది. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చెబుతున్నారు. ఆఫ్రికాకు ఆయుధాలు సరఫరా చేసే ముసుగులో వాటిని ర ష్యాకు పంపుతున్నారని బైడెన్ తీవ్ర విమర్శలు చేశారు.
ఈ మేరకు ఉత్తర కొరియా ఆఫ్రికాకు సరఫరా చేస్తున్న ముసుగులో రష్యాకు గణనీయంగా ఆయుధ సామాగ్రిని పంపుతున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది. అయితే రష్యా.. ఉత్తర కొరియా పంపిన ఆ మందుగుండు సామాగ్రిని స్వీకరించిందో లేదో తెలియదు అని అమెరికా అధ్యక్ష భవనం.. వైట్ హౌస్ జాతీయ ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు.
ఉక్రెయిన్‌పై వినియోగించేందుకు ఉత్తర కొరియా నుంచి మిలియన్ల కొద్దీ రాకెట్లు, ఫిరంగి షెల్స్‌ను కొనుగోలు చేసే ప్రక్రియలో రష్యా ఉందని యూఎస్ ఇంటెలిజెన్స్ బాంబుపేల్చింది.
ఇప్పటికే రష్యాపై యూరోప్‌లోని పలు దేశాలతోపాటు అమెరికా సైతం ఆర్థిక ఆంక్షలు విధించింది. దీంతో రష్యా.. తమ మిత్ర దేశాలు, అమెరికాకు శత్రు దేశాలైన ఇరాన్, ఉత్తర కొరియాలవైపు ఆయుధాల కోసం చూస్తోంది. తద్వారా ఉక్రెయిన్‌కు సాయం అందిస్తున్న అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు ధీటుగా యుద్ధంలో దూకుడు చూపొచ్చని రష్యా విశ్వసిస్తోందని అంటున్నారు.
అమెరికా అంటే మండిపడే ఉత్తర కొరియా ఇదే సరైన సమయం అని భావిస్తోంది. అమెరికా.. ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందిస్తుంటే.. ఉత్తర కొరియా.. రష్యాకు ఆయుధాలు అందిస్తోంది. తద్వారా రష్యాపైన అంతర్జాతీయ ఆంక్షలను ఉత్తర కొరియా ధిక్కరించింది. అంతేకాకుండా దక్షిణ కొరియాతో కలసి అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టడం, తనను భయపెట్టాలని చూస్తుండటం వంటి కారణాలతో ఉత్తర కొరియా.. రష్యాకు చేరువవుతోంది.
మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు పాకిస్తాన్ సాయం చేస్తుందనే వార్తలు వచ్చాయి. అణ్వాయుధాలను అభివృద్ధి చేసేందుకు ఉక్రెయిన్.. పాకిస్తాన్ సాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉక్రెయిన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ వెళ్లి్ల చర్చలు జరిపినట్టు రష్యా సెనెటర్ ఒకరు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే మండిపడ్డ రష్యా... పాకిస్తాన్ ను హెచ్చరించించినట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్ నిపుణులు పాకిస్తాన్ వెళ్లి అణ్వాయుధ సాంకేతికతపై చర్చించినట్టు రష్యా ఫెడరేషన్ కౌన్సిల్ ఢిపెన్స్ మెంబర్ ఇగోర్ మోరోజోవ్ విమర్శలు చేశారు. ఈ విషయాన్ని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ కూడా పేర్కొనడం గమనార్హం. కాగా పాకిస్తాన్‌పై గతంలో రష్యా-ఉక్రెయిన్ వివాదంలో ఉక్రెయిన్ కు ఆయుధాలు పంపించిందనే అభియోగాలు ఉన్నాయి.
ఉక్రెయిన్ సైన్యానికి గ్లౌజులు సరఫరా చేయడానికి పాకిస్తాన్‌లోని బ్లూలైన్స్ కార్గో ప్రైవేట్ లిమిటెడ్ ను ఉక్రెయిన్ ప్రభుత్వ ప్రతినిధులు సంప్రదించినట్లు సమాచారం. ఉక్రెయిన్ బలగాలు ఉపయోగించే 122 ఎంఎం అధిక పేలుడు ఆర్టిలరీ షెల్స్‌ను పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సులో తయారుచేస్తారని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఉక్రెయిన్ కు పాకిస్తాన్ సహకరిస్తుందని స్పష్టమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.