పారిశ్రామికవేత్తల్లో అణు భయం పెరిగిపోతోందా ?

Update: 2022-10-14 05:54 GMT
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం దెబ్బకు రెండు దేశాల్లోని పారిశ్రామిక వేత్తల్లో అణుయుద్ధం భయం పెరిగిపోతోంది. సంప్రాదాయ యుద్ధం మొదలై ఇప్పటికి 7 నెలలు. ఇంకా ఎంతకాలం యుద్ధం జరుగుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈ నేపధ్యంలోనే రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికా, నాటో దేశాలు నిలవడంతో యుద్ధం సుదీర్ఘకాలం సాగే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో మరింత కాలం యుద్ధం చేసే ఉద్దేశ్యం లేకపోవటంతో ఉక్రెయిన్ పై రష్యా అణు యుద్ధానికి దిగే అవకాశాలను పరిశీలిస్తోంది.

ఇప్పటికే అణు యుద్ధానికి దిగుతామని రష్యా అధినేత వ్లాదిమర్ పుతిన్ వార్నింగ్ కూడా ఇఛ్చారు. దాంతో ఉక్రెయిన్ కు మద్దతుగా తాము కూడా అణ్వాయుధాల ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా ప్రకటించింది.

దీంతో ఏదో రోజు అణ్వాయుధాల ప్రయోగం తప్పదని ప్రపంచదేశాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. దీనికితోడు ఉత్తర కొరియా అణ్వాయుధాల పరీక్షలు టెన్షన్ను మరింతగా పెంచేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే రష్యా, ఉక్రెయిన్లోని అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తరలిపోతున్నారు.

ఈ రెండు దేశాల్లో పరిశ్రమలు నడపటం, వ్యాపారాలు చేయటం ఏమాత్రం క్షేమకరం కాదని అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు డిసైడ్ అయిపోయాయి. ఇప్పటికే రష్యానుండి పదులసంఖ్యలో పరిశ్రమలు మూతపడిపోయాయి. తమ ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఉద్యోగులను విదేశాలకు తరలించేశాయి. ఇది సరిపోదన్నట్లుగా మరో 1200 పరిశ్రమలు మూతపడే దిశలో ఉన్నాయి.

తాజాగా మెక్ డొనాల్డ్స్, నిస్సాన్ తో పాటు బ్రిటీష్ కు చెందిన 15 కంపెనీలు మూతపడిపోయాయి.

యుద్ధం కారణంగా ఇప్పటికే రెండు దేశాలు ఆర్థికంగా బాగా దెబ్బతినేశాయి. అమెరికా, మిత్రదేశాలు ఆదుకుంటున్నాయి కాబట్టి ఉక్రెయిన్ ఈమాత్రమైనా నెట్టుకొస్తోంది. లేకపోతే రష్యాకు ఎప్పుడో లొంగిపోయేదే అనటంలో సందేహంలేదు. అయితే రష్యాలో మూతపడే పరిశ్రమలన్నీ భారత్ వైపుకు వస్తాయని అనుకున్నా అలా జరగటంలేదు. ఒక్కసంస్ధ కూడా భారత్ వైపు చూడలేదు. కరోనా వైరస్ కారణంగా చైనా నుండి వెళ్ళిపోయిన వందలాది పరిశ్రమలు భారత్ వైపుకే వస్తాయని అనుకున్నా అలా జరగలేదు. చైనా నుండి తరలిపోయిన పరిశ్రమల్లో ఒక్కశాతం కూడా ఇండియాలోకి రాలేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News