పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పగటికలలు కంటున్నాడు. రాష్ట్రంలో తామే ప్రత్యామ్మాయం అంటూ ఆయన చేసిన ప్రకటన రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.తాజాగా అమరావతిలో పర్యటించిన పవన్ కళ్యాణ్ పంచాయతీ ఎన్నికల్లో విజయాన్ని గొప్పగా చాటారు. ఏపీ ప్రజల్లో మార్పు మొదలైందని జనసేన అధినేత పవన్ కళ్యాన్ అన్నారు. 65శాతం పంచాయతీల్లో జనసేన మద్దతుదారులు రెండో స్థానంలో నిలవడం ఇందుకు నిదర్శనమన్నారు.
మొత్తంగా తాము 27శాతం ఓటింగ్ పొందామని పవన్ కళ్యాన్ గర్వంగా చెప్పారు. జనసేన మద్దతుదారులు గెలిచిన పంచాయతీల్లో కేరళ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. కేవలం ఒకట్రెండు వర్గాలు పల్లెలలపై పెత్తనం చేయడం వల్ల గ్రామాలు నలిగిపోతున్నాయని పవన్ చెప్పారు.
నిజానికి పంచాయతీ ఎన్నికల్లో పవన్ కానీ.. జనసేన నాయకులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. పంచాయతీలను లైట్ తీసుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పవన్ ను నమ్ముకున్న నేతలు, కార్యకర్తలు ఓన్ చేసుకొని తమ సొంత జెండా అజెండా నీతి నిజాయితీలతో గెలిచారు.పంచాయతీల్లో టికెట్ల కేటాయింపు ఉండదు.. పార్టీ గుర్తు ఉండదు. అందుకే నీతి నిజాయితీగల వారు.. ఊరికోసం తపన పడే యువత సొంతంగా జనసేన అంటూ బరిలోకి దిగి గెలిచారు.
ఆ గెలుపును పవన్ తన ఖాతాలో వేసుకొని ఇప్పుడు ప్రత్యామ్మాయం అంటున్నాడు. ఏపీలో గత ఎన్నికల్లో పవన్ టికెట్లు ఇచ్చినా.. స్వయంగా రెండు చోట్ల పోటీచేసినా ఇదే జనాలు చిత్తుగా ఓడించారు. పంచాయతీల్లో యువత గెలుపు ను కూడా ఇప్పుడు తన ఖాతాలో వేసుకున్నాడు.