విజయనగరం జిల్లాలోని రాజాం.. ఇప్పుడు ఆసక్తిగా మారింది. రెండు సార్లు వరుస విజయాలు దక్కించు కున్న వైసీపీ వచ్చే ఎన్నికల్లోనూ.. విజయం దక్కించుకుని తీరాలని.. టీడీపీకి కంచుకోట అయిన రాజాం లో హ్యాట్రిక్ కొట్టాలని.. ఉవ్విళ్లూరుతోంది. ఇక్కడ నుంచి గెలిచిన కంభాల జోగులుకు మాత్రం ఎందుకు ఉండదు. ఆయనకు కూడా ఆశలు బాగానే ఉన్నాయి. అయితే..ఎటొచ్చీ.. ఆయనకు ఇంటి పోరు ఎక్కువైందని అంటున్నారు.
''అన్నా టీడీపీ ఓళ్లపైనే గెలిచావు.. నీకు ప్రాధాన్యం లేకుండా పోయిందేంటన్నా!'' అని కొందరు ఆయన ను ప్రశ్నిస్తూనే ఉన్నారు. దీంతో ఆయన మానసికంగా.. ఇబ్బంది పడుతున్నారు.
ఇక, నియోజకవర్గంలో గడప గడపకు నిర్వహిస్తున్న సమయంలో.. ప్రజలకు ఈయన అభివృద్ధి, సంక్షేమం వంటివాటిని వివరించేందుకు ప్రయత్నిస్తే.. వారేమో.. రోడ్లు బాగాలేవు.. పింఛన్లు రాస్తారా? అంటూ. ప్రశ్నిస్తున్నారు. దీంతో దాదాపు వెళ్లడం.. తగ్గించేయాలని అనుకుంటున్నారు.
కానీ, ఇంతలోనే.. జగన్ మళ్లీ ఆదేశాలు జారీ చేయడం.. ప్రజల్లోకి వెళ్లకపోతే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. దీంతో జోగులు టెన్షన్ పడుతున్నారని అంటున్నారు. ఇక, వచ్చే ఎన్నికల్లో జోగులుకు గెలుపు అంత ఈజీకాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టీడీపీ సీటు కావడం.. వరుసగా రెండు సార్లు విజయం దక్కించుకున్నా.. జోగులు తమకు ఏమీ చేయలేదనేభావన ఇక్కడ ప్రజలు వ్యక్తం చేస్తుండడం వంటివి.. ఇబ్బందిగా మారాయి.
మరోవైపు.. టీడీపీలో ఇద్దరు నేతలు ఇక్కడ నుంచి పోటీకి రెడీ గా ఉన్నారు. ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ.. దూకుడుగా ఉంది. ఇప్పటికే తొడగొట్టి...సీఎంజగన్‌పైనా.. నేతలపైనా.. తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పి స్తున్నారు. ఇది యువతలోకి బాగా వెళ్లింది.
అదేవిధంగా మాజీ మంత్రి కోండ్రు మురళి కూడా.. పార్టీకి అనుకూలంగా.. వ్యవహరిస్తున్నారు. వీరిద్దరిలో టికెట్ కోసం అయితే.. పోటీ ఉంది. కానీ ఎవరికి టికెట్ ఇచ్చినా.. విజయం మాత్రం ఖాయమనే భావన వ్యక్తమవుతోంది. ఇది కూడా..జోగులుకు టెన్షన్ పెడుతోందని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.