టీఆర్ఎస్ ఉద్దండ పిండాలంతా మగవారే.. కేసీఆర్, కేటీఆర్, సంతోష్ కుమార్. ఉన్న ఒక్క కల్వకుంట్ల ఆడకూతురు కవిత ఓడిపోయే.. అందుకే గులాబీ దళంలోకి ఏరికోరి వలసలను ప్రోత్సహించి సీఎం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీల నుంచి సీనియర్ నాయకురాళ్లు సబితా ఇంద్ రారెడ్డి, సత్యవతి రాథోడ్ లను తీసుకొచ్చారు. కారెక్కించారు.
అయితే వైఎస్ హయాంలో తొలి మహిళా హోంమంత్రిగా చేసిన సబిత రాక తో టీఆర్ఎస్ బలోపేతం అవుతుందని మహిళ నేత లోటు తీరుతుందని భావించారు.
కానీ మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో సబిత ప్రాతినిధ్యం వహిస్తున్న బడంగ్ పేట్ కార్పొరేషన్ లో టీఆర్ఎస్ కు చుక్కలు కనిపించాయి. టీఆర్ఎస్ దారుణంగా ఓడిపోయింది. గ్రామాల్లో పార్టీ అభ్యర్థులు ఏటికి ఎదురీదారు. ఏదోలా ఎక్స్ ఆఫీషియోలు, ప్రత్యర్థుల నుంచి నేతలను లాగి కార్పొరేషన్ మేయర్ పదవిని సబిత టీఆర్ఎస్ వశం చేసి పరువు కాపాడారు. అయితే మేయర్ పీఠం దక్కినా స్థానికంగా మాత్రం పార్టీ ఓడిపోయి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి.
బడంగ్ పేట్ కార్పొరేషన్ లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం గులాబీ పార్టీని కలవరపెట్టింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన పారిజాతరెడ్డిని సబిత లాగేసి ఆమెకు మేయర్ పదవి ఇచ్చి టీఆర్ఎస్ గెలిచేటట్టు చేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడడం టీఆర్ఎస్ కు షాకింగ్ మారింది.
విశేషం ఏంటంటే సబితా ఎలాగోలా టీఆర్ఎస్ కు కార్పొరేషన్ పదవి దక్కేలా చేసినా అక్కడ 13 సీట్లే గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులకు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కకపోవడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి లాగేసిన పారిజాత రెడ్డికి మేయర్, స్వతంత్ర అభ్యర్థి శేఖర్ కు డిప్యూటీ మేయర్ ఇచ్చి గులాబీ కార్పొరేటర్ల ను డమ్మీ గా చేసేసింది సబిత. ఆమె పరువు కాపాడడం కోసం పక్క పార్టీ వారికి అందలమెక్కించిన తీరు చర్చనీయాంశమైంది. ఇక్కడ గులాబీ పార్టీ గెలిచి ఓడినట్టు అయ్యింది.