ష‌ర్మిల‌, జ‌గ‌న్.. విభేదాలు తొల‌గిన‌ట్టేనా?

Update: 2022-09-02 06:34 GMT
సెప్టెంబ‌ర్ 2న దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని రాష్ట్ర‌వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. వైఎస్సార్ విగ్ర‌హాల‌కు వైఎస్సార్సీపీ నేత‌ల నివాళులు, అన్న‌, వ‌స్త్ర‌దానాలు వంటివి చేస్తున్నారు.

ఇక వైఎస్సార్ స‌మాధి ఉన్న ఇడుపులపాయ ఘాట్లో ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం వైఎస్ జ‌గ‌న్, ఆయ‌న స‌తీమ‌ణి వైఎస్ భార‌తి, వైఎస్ విజ‌య‌మ్మ వ‌చ్చారు. అంతేకాకుండా వైఎస్ ష‌ర్మిల కూడా వ‌చ్చారు. వైఎస్ జ‌గ‌న్, వైఎస్ ష‌ర్మిల ప‌క్క‌పక్క‌నే కూర్చోవ‌డంతోపాటు ప‌ల‌క‌రించుకోవ‌డం విశేషం.

మామూలుగా అయితే జ‌గ‌న్, ష‌ర్మిల భేటీకి పెద్ద విశేషం ఉండేది కాదు. అయితే త‌న అన్న జ‌గ‌న్ తో విబేదించి వైఎస్ ష‌ర్మిల తెలంగాణ‌లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) ఏర్పాటు చేశారు. ష‌ర్మిల తెలంగాణ‌లో పార్టీ పెట్ట‌డం త‌మ‌కు ఇష్టం లేద‌ని వైఎస్ జ‌గ‌న్ కుడి భుజం, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అప్ప‌ట్లోనే మీడియా ముఖంగా వెల్ల‌డించారు. అంతేకాకుండా త‌మ‌కు ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేద‌న్నారు. దీనిపై ఒక మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ష‌ర్మిల ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

త‌న అన్న జ‌గ‌న్ జైల్లో ఉన్న‌ప్పుడు వైఎస్సార్సీపీ కోసం తాను ఎన్నో చేశాన‌ని.. అలాంటిది తాను పార్టీ పెట్టుకుంటే సంబంధం లేద‌న‌డం బాధ‌నిపించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆ త‌ర్వాత ష‌ర్మిల‌, జ‌గ‌న్ ప‌లు సంద‌ర్బాల్లో ముఖ్యంగా వైఎస్సార్ జ‌యంతి, వ‌ర్దంతి కార్య‌క్ర‌మాలకు హాజ‌రవుతున్నా ఇద్ద‌రి మ‌ధ్య మాట‌లు లేవ‌నే ప్ర‌చారం జ‌రిగింది. కొన్నిసార్లు ఇడుపుల‌పాయ వైఎస్సార్ ఘాట్‌కు ష‌ర్మిల వ‌చ్చి వెళ్లాక జ‌గ‌న్ రావ‌డం లేదా జ‌గ‌న్ వ‌చ్చి వెళ్లాక ష‌ర్మిల రావ‌డం వంటివి జ‌రిగాయి.

ఈ నేప‌థ్యంలో సెప్టెంబ‌ర్ 2న వైఎస్సార్ ఘాట్లో సీఎం జ‌గ‌న్, ఆయ‌న సోద‌రి ష‌ర్మిల ప‌క్క‌పక్క‌నే కూర్చుని ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్నారు .అంతేకాకుండా వారిద్ద‌రూ మాట్లాడుకున్నార‌ని కూడా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు తొల‌గిన‌ట్టేన‌ని భావిస్తున్నారు.  

త‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌తో జ‌గ‌న్ వైఎస్సార్సీపీ గౌర‌వ అధ్య‌క్షురాలి ప‌ద‌వికి రాజీనామా చేయించార‌ని ప్ర‌తిపక్ష నేత‌లు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా త‌న చెల్లి ష‌ర్మిల‌ను రోడ్డున ప‌డేశార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్‌తో షర్మిల‌కు తీవ్ర విభేదాలున్నాయ‌ని ప్ర‌చార‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఇద్ద‌రూ క‌లిసి త‌మ తండ్రి వైఎస్సార్‌కు నివాళుల‌ర్పించ‌డం విశేషం.

మ‌రోవైపు విశ్లేష‌కులు చెప్పే మాట ఏమిటంటే.. జ‌గ‌న్, ష‌ర్మిల మ‌ధ్య అభిప్రాయ భేదాలు నిజ‌మే కానీ.. అవి మాట్లాడుకోనంత పెద్ద‌వి కాద‌ని.  ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్, ష‌ర్మిల ప‌క్క‌పక్క‌నే కూర్చోవ‌డం, ఇద్ద‌రూ మాట్లాడుకోవ‌డంతో ఆ ప్ర‌చారాలు నిజం కావ‌ని స్ప‌ష్ట‌మైంద‌ని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News