తెలుగు రాజకీయ పార్టీలపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ప్రభావం బాగా పడినట్లే ఉంది. రెండు రాష్ట్రాల్లోని పార్టీల నేతలు షిండే జపమే చేస్తున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ వచ్చే ఎన్నికల తర్వాత సీఎం రమేష్ ఆపరేషన్ షిండే నిర్వహించబోతున్నట్లు పెద్ద బాంబు పేల్చారు. సీఎం రమేష్ ఏమిటి ? షిండే పాత్ర పోషించబోవటం ఏమిటో జనాలకు అర్థం కావటం లేదు.
ఎంపీ చెప్పిందేమంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 40-50 సీట్లు వస్తే షిండే మహారాష్ట్రలో షిండే శివసేనను చీల్చినట్లే ఏపీలో సీఎం రమేష్ టీడీపీలో చీలిక తీసుకొస్తారని స్పష్టంగా ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో నాని ఎలా చెప్పగలరు ? 160 సీట్లతో అధికారంలోకి వచ్చేది తామే అని చంద్రబాబు నాయుడు అండ్ కో అనుకుంటున్నారు. అయినా టీడీపీలో చీలిక తెచ్చేంత సీన్ రమేష్ కుందా ?
నాని ఏ ముహూర్తంలో చెప్పారో కానీ టీడీపీతో పాటు జనాల్లో కూడా ఇపుడిదే చర్చ జరుగుతోంది. ఇక తెలంగాణా విషయానికి వస్తే బీజేపీ ఎంఎల్ఏ రాజాసింగ్ మాట్లాడుతు తొందరలోనే తెలంగాణలో కూడా మహారాష్ట్ర తరహా రాజకీయాలు రాబోతున్నట్లు చెప్పారు.
అంటే రాజాసింగ్ మాటలను బట్టి తొందరలోనే టీఆర్ఎస్ లో చీలిక రాబోతోందనే అనుకోవాలి. రాజాసింగ్ చెప్పినట్లు టీఆర్ఎస్ లో నిజంగానే అలాంటి పరిస్ధితుందా ? మహారాష్ట్రలో అంటే ఉద్థవ్ థాక్రే అసమర్ధుడు కాబట్టే షిండే సక్సెస్ అయ్యారు.
కానీ కేసీయార్ పరిస్థితి అలా కాదు. రాజకీయాల్లో బాగా అనుభవం ఉన్న వ్యక్తే. పైగా ఉద్యమాలు నడిపిన అనుభవం ఉన్న నేత. జనాలకు కేసీయార్ పాలనపైన వ్యతిరేకత ఉంటే ఓట్లేయకుండా ఓడించారంటే ఆశ్చర్యం లేదు. అంతేకానీ ఇప్పట్లో కేసీయార్ కు వ్యతిరేకంగా ఎవరో నాయకత్వం వహించి ప్రభుత్వాన్ని కూల్చేసేంత సీన్ ఏ నేతకు లేదనే అనుకోవాలి. మొత్తానికి తెలుగు రాజకీయాల్లో షిండే జపమైతే చేస్తున్నది వాస్తవం.