దేశంలో లక్షలాది మంది ప్రజాసేవకులు ఉన్నారు. ప్రజలకు సేవ చేయటం కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ.. వారెవరూ చేయలేని పనిని ఒక సినీ నటుడు అది కూడా రీల్ లైఫ్ లో విలన్ వేషాలు వేసే సోనూసూద్ చేయటం.. దేశ వ్యాప్తంగా ఆయనకు రాజకీయాలకు అతీతంగాఅభిమానులు ఉన్నారు. రీల్ లో ఎంతోమంది సూపర్ స్టార్లు ఉండొచ్చుకాక.. రియల్ లైఫ్ లో మాత్రం సోనూకు మించిన రియల్ హీరో మరెవరూ లేరనే చెప్పాలి. సాయం కోరిన వారికి.. వెంటనే సాయం అందించే వ్యక్తిగాఆయన సుపరిచితులు.
ఏ ఊరు అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనప్పటికి.. గోదావరి జిల్లాలో పుట్టిన నేపథ్యంలో ఆమెది ఏపీగానే చెప్పాలి. తర్వాతి కాలంలో చదువుల కోసం ముంబయి వెళ్లిపోవటం.. అక్కడే స్థిరపడిపోయారు. అనంతరం సోనూసూద్ తో పరిచయం తర్వాతి కాలంలో పెళ్లి చేసుకున్నారు. ఇక్కడి వరకు ఆమె ఏపీకి చెందిన వారన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. సోనూసూద్ ఆంధ్రాఆల్లుడనే చెప్పాలి.
తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు సోనూసూద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తనది తెలంగాణ అని చెప్పినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఈ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటల్నిచూస్తే.. ఆమె అలా చెప్పలేదన్న భావన కలగటం ఖాయం. తాము ముంబయిలో స్థిరపడ్డామని.. తమ చుట్టాలందరూ హైదరాబాద్.. చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నారని.. వారింట్లో జరిగే శుభకార్యాలకు తాను హైదరాబాద్ వస్తుంటానని పేర్కొన్నారు. ఈ విధంగా చూస్తే తాను తెలంగాణ అమ్మాయినని.. సోనూ తెలంగాణ అల్లుడని ఆమె పేర్కొన్నట్లుగా రాశారు.
ఆ మాటకు వస్తే.. గడిచిన కొన్నేళ్లు ప్రాంతం ఏదైనా హైదరాబాద్.. దాని పరిసర ప్రాంతాల్లో సెటిల్ అయిన వారు ఎక్కువగా కనిపిస్తుంటారు. అంతమాత్రాన వారంతా తెలంగాణ వారైపోరు కదా? సోనూ సతీమణి సోనాలి మాటల్ని తప్పుగా అర్థం చేసుకునే.. ఆయన్ను తెలంగాణ అల్లుడు ఖాతాలో వేశారన్న భావన వ్యక్తమవుతోంది. ఇదంతా ఎందుకు.. సోనూ తెలుగింటి అల్లుడన్న మాటకు ఫిక్సు అయితే.. ఇంకేం చర్చ ఉండేదమో కదా?