తెలంగాణాలో బీజేపీ ఏ తప్పయితే చేస్తోందో ఏపీలో టీడీపీలో కూడా సేమ్ టు సేమ్ అదే తప్పు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో జగన్మోహన్ రెడ్డి భార్య భారతి హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపణలు మొదలుపెట్టారు.
లిక్కర్ స్కాంపై దర్యాప్తు చేస్తున్న సంస్ధ భారతి పేరును ఇప్పటివరకు ఎక్కడా ప్రస్తావన తేలేదు. అయినా సరే ఏదేదో బీరకాయపీచు సంబంధం అంట కట్టేసి భారతి పేరునే సీబీఐ ప్రస్తావించిందంటు టీడీపీ నేతలంతో పదే పదే ఆరోపిస్తున్నారు.
నిజానికి స్కాంను దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటివరకు వైఎస్ భారతి పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టిన వారే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కూడా ఉన్నారనేది టీడీపీ నేతలు ఆరోపణ.
ఢిల్లీ లిక్కర్ స్కాం ఇప్పటిదైతే, జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబుడల వ్యవహారం దాదాపు 13 ఏళ్ళకిందటిది. ఈ రెండింటికి మద్య లింకులు ఎలా పెడుతున్నారో టీడీపీ నేతలకే తెలియాలి. అయినా దర్యాప్తు సంస్ధ భారతి పేరు ప్రస్తావించకుండానే టీడీపీ నేతలకు అంత అత్యుత్సాహం ఎందుకు ?
తెలంగాణాలో బీజేపీ కూడా ఇలాంటి తప్పేచేసింది. రాజకీయంగా టార్గెట్ చేయటం కోసం ఢిల్లీలో బీజేపీ ఎంపీలిద్దరు మాట్లాడుతూ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత పాత్రుందని ఆరోపించారు. ఆరోపణలు రెండురోజులు దుమారం రేపి తర్వాత సద్దుమణిగిపోయింది. ఎందుకంటే సీబీఐ ఎక్కడా కవిత పేరును ప్రస్తావించలేదు. ఇలాంటి ఆరోపణలన్నీ కేవలం రాజకీయంగా ఒకటి రెండు రోజులు దుమారం రేపటానికి మాత్రమే పనికొస్తుంది.
నిజంగానే సీబీఐ కవిత, భారతి పేర్లను ప్రస్తావిస్తే వాళ్ళ గురించి ఎంతైనా మాట్లాడచ్చు. ఎలాంటి ఆధారాలు లేకుండానే భారతిపై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. భారతి పేరును తొందరలోనే సీబీఐ ప్రకటించబోతున్నట్లు మహిళా నేతలు ఆరోపిస్తుండటమే విచిత్రంగా ఉంది. అంతవరకు ఓపిక పడితే టీడీపీకి వచ్చే నష్టమేంటి ? లేనిపోని ఆరోపణలతో రాజకీయ వాతావరణాన్ని కాలుష్యం చేయటానికి మాత్రమే ఇలాంటి ఆరోపణలు పనికి వస్తాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.