అశోక్ ప్ర‌భ మ‌స‌క‌బారుతోందా? ర‌ంగంలోకి కొత్త నేత‌!

Update: 2021-03-10 14:30 GMT
రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఏమాత్రం తేడా వ‌చ్చినా.. రీప్లేస్ చేసేందుకు ఎవ‌రూ వెనుకాడ‌ని రోజులు ఇప్పుడు కొన‌సాగుతున్నాయి. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. విజ‌య‌న‌గ‌రం జిల్లా టీడీపీ రాజ‌కీయాలు స‌రికొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాల్లో ఉండ‌డ‌మే కాకుండా టీడీపీని నిల‌బెట్టి.. కీల‌క నేత‌గా ఎదిగిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఇప్పుడు పార్టీని న‌డిపించ‌లేక పోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. పైగా.. ఆయ‌న‌తో క‌లిసి వ‌చ్చే నేత‌లు కూడా త‌గ్గిపోతున్నారు. వ‌ర్గ పోరు ఒక రేంజ్‌లో కొన‌సాగుతోంది. ఇవ‌న్నీ వాస్త‌వాలేన‌ని పార్టీలో కొన్నాళ్లుగా చ‌ర్చ సాగుతోంది. మ‌రి దీనికి విరుగుడు ఏంటి? అంటే. కొత్త నేత‌కు అవ‌కాశం ఇవ్వ‌డ‌మే!!

ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. టీడీపీ అంత‌ర్గ‌త నిర్ణ‌యంగా నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్పుడు నెమ్మ‌దిగా వెలుగు చూసింది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న విజ‌య‌న‌గ‌రం మునిసిపాలిటీ ఎన్నిక‌ల్లో టీడీపీ క‌నుక ప‌ట్టు సాధించ‌లేక పోతే.. ఇక‌, అశోక్‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే అశోక్ వ‌ర్గం తెర‌మరుగై పోయింది. చాలా మంది నాయ‌కులు మంత్రి, వైసీపీ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ కూట‌మిలో చేరిపోయారు. ఉన్న‌వారు కూడా ఎవ‌రికి వారుగా చక్రం తిప్పుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ఈ ఎన్నిక‌ల్లో అశోక్ ఒంట‌రిపోరు చేశారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే రిజ‌ల్ట్‌ను బ‌ట్టి.. ఆయ‌న‌కు ప్రాధాన్యం ఇవ్వాలా? వ‌ద్దా? అనేది స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని అంటున్నారు సీనియ‌ర్ నాయ‌కులు.

వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో అశోక్‌కు ఆయ‌న కుమార్తె అదితికి.. చంద్ర‌బాబు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. అయితే.. ఒక్క‌రు కూడా గెల‌వ‌లేదు. ఈ నేప‌థ్యంలో అప్ప‌ట్లోనే అశోక్‌ను త‌ప్పించాల‌నే డిమాండ్లు తెర‌మీదికి వ‌చ్చాయి. అయితే.. ఆయ‌న సీనియార్టీ.. చంద్ర‌బాబుతో ఉన్న అనుబంధం వంటివి అడ్డువ‌చ్చాయి. అయితే.. ఇప్పుడు కూడా ఉపేక్షిస్తే.. పార్టీ మొత్తానికే పుట్టిమున‌గ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కిమిడి మృణాళిని.. కుమారుడు.. నాగార్జున‌ను ఇప్ప‌టికే నాన్‌లోక‌ల్ అయిన‌ప్ప‌టికీ.. విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా నియ‌మించారు. గ‌త ఎన్నిక‌ల్లో చీపురుప‌ల్లి నుంచి పోటీ చేసిన నాగార్జున ఓడిపోయారు.

అయితే.. ఇప్పుడు మాత్రం .. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏకంగా అశోక్ స్థానం.. విజ‌య‌న‌గ‌రం ఎంపీ స్థానం పోటీ చేయించే యోచ‌న‌ లో ఉన్నార‌ని అంటున్నారు సీనియ‌ర్లు. దీనికి కూడా రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి ఆయ‌న యువ నాయ‌కుడు. యువ‌త‌ను బాగా క‌లుపుకొని పోతున్నారు.. ఇక‌, రెండు.. సామాజిక వ‌ర్గం. ఈ రెండూ కూడా ప్ల‌స్ అవ‌డంతో పాటు.. అశోక్‌ పై ఉన్న వ్య‌తిరేక‌త‌ కు కూడా చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు సీనియ‌ర్లే గుస‌గుస‌ లాడుతుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి మునిసిపాలిటీ ఎన్నిక‌లు.. అశోక్ భ‌వితవ్యాన్ని తేల్చేస్తాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News